నేచురల్ స్టార్ గా పక్కింటి కుర్రాడిగా పాపులరైనా కానీ ప్రతిసారీ తనదైన స్టైల్ లో కొత్తదనం అందించేందుకు నాని ప్రయత్నిస్తున్నాడు.ఇక నాని నెగెటివ్ షేడ్ ఉండే పాత్రల్లోనూ సత్తా చాటాలని తెగ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంతకుముందు జెండా పైకపిరాజు ఇంకా వీ లాంటి సినిమాల్లో ఇలాంటి సాహసం చేశాడు. ఆ సినిమాల హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నానీ మంచి ప్రశంసలందుకున్నాడు. ఇక నటుడిగా కూడా అతడికి వంద మార్కులేశారు.ఇక ఇప్పుడు మరోసారి అలానే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించేందుకు నాని ప్రిపేరవుతున్నాడట.ఇక అందుకే గుబురు గడ్డం జులపలా జుట్టు పెంచుతున్నాడట. తాజా సినిమాలో అతడు ద్విపాత్రాభినయం చేస్తాడని నైజాం యాసలో మాట్లాడతాడని కూడా గాసిప్ వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ `దసరా`. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. రెండు పాత్రల్లో ఒకటి పూర్తి ఊరమాస్ పాత్రగా ఉంటుంది. మంచి రగ్గడ్ లుక్ తో ఉన్న పాత్రలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. జెండాపై కపిరాజు ఇంకా వి సినిమాల తర్వాత నాని నెగెటివ్ రోల్ లో మూడోసారి ప్రయత్నిస్తున్నాడు. ఓమిక్రాన్ ప్రభావం తగ్గిన తరువాత రామగుండం గనుల్లో షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం తెలిసింది. ప్రస్తుతం నానీ లుక్ ఛేంజ్ కోసం సీరియస్ గా వర్కవుట్లు కూడా చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.ఇక న్యాచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా ఫ్లాపైనా కానీ `శ్యామ్ సింగ రాయ్` పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. కరోనా మహమ్మారి కష్టంలోనూ మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ఇది. స్టార్ల నుండి ప్రేక్షకుల వరకు ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. ఇక తరువాత అతడు చేసే సినిమా దసరాని తెలుగు-తమిళంని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న నాని స్కెచ్ ఒకటి పరిశీలిస్తే కనుక అది గుబురు గడ్డం జులపలా జుట్టుతో `పుష్ప`ని కొట్టేలా కనిపిస్తున్నాడు నాని. ఇక కంటెంట్ కూడా ఆ రేంజును మించుతుందేమో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: