ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోనే కాక సామాన్య ప్రజలు మిగతా రంగాలకు  సంబంధించిన వారు కూడా ఎక్కువుగా విడాకులు తీసుకుంటున్నారు. దానికి కారణం ఇది అన్నీ సరిగ్గా చెప్పలేం  కానీ... వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తప్పే అని అంటున్నారు  పలువురు పెద్దలు. మన జీవితంలో ప్రేమ,పెళ్లి కి ఎంతో ముఖ్య స్దానం ఉంది అని, వాటితో మనకు విడతీయ్యరాని అనుబంధం ఉంటుందని..కానీ నేటి కాలంలో  చాలా మంది చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు తెలిసి కొందరు తెలియక కొందరు జీవితంలో తప్పుడు నిర్ణయాలు  తీసుకుని లైఫ్ లో సరిద్దిదుకోలేని మిస్టేక్ చేస్తున్నారు అంటున్నారు సినీ పెద్దలు.


ఇప్పటి వరకు మనం ఎన్నో బ్రేకప్ వార్తలు, విడాకులు తీసుకుంటున్న స్టార్ కపుల్స్ అని న్యూస్ లు విన్నా కానీ వాటిలోకి ఎక్కువ మందిని బాధ పెట్టిన డైవర్స్ న్యూస్ మాత్రం  సమంత నాగ చైతన్యదే. అస్సలు వీళ్లిద్దరు   ఇలా విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు. వీరి మధ్య అలాంటి గొడవలు జరుగుతున్నాయి అని కూడా ఎవ్వరికి అనుమానం రాలేదు. ఎందుకంటే అంత అన్యోన్యంగా ఉండేవారు ఈ జంట. పైగా అక్కినేని ఇంటి కోడలు అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ జంటను చూసి చాలా మంది టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అని కూడా బిరుదు ఇచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు విడాకులు తీసుకుని ఎవరి దారి వారిది అన్నట్లు వెళ్లిపోవడానికి రెడీ అవుతున్నారు.

ఇక రీసెంట్ గా నాగార్జున విడాకుల తరువాత చైతన్య బిహేవియర్ గురించి మాట్లాడుతూ.."చైతన్య ను నేను ఎప్పుడు అలా చూడలేదు. విడాకుల తరువాత తన ప్రవర్తన చూసి నాకు నేనే షాక్ అయ్యాను. విడాకుల సమయంలో నాగచైతన్య మానసిక పరిస్థితిని కూడా బాగా మ్యానేజ్ చేసుకున్నాడు. ఆ టైంలో తన బిహేవియర్ చుసి గర్వపడ్డాను. ఒక తండ్రి గా నా కొడుకు జీవితం ఏమైపోతుందో అని  బాధపడుతుంటే.. తను మాత్రం నా గురించి బాధపడుతూ.. ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను ఆ ఇష్యూ నుండి ఆలోచనలు డైవర్ట్ చేసాడు"..అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగ్ చేసిన కామెంట్స్  సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: