యాంకర్ సుమ అంటేనే.. ఆనందం, సంతోషం ఆమె వెంటబెట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక ఆమె బుల్లితెరపై చేసేటటువంటి సందడి మామూలుగా ఉండదు. ఇక సినిమా వాళ్ళు ఇప్పుడైతే ఆడియో ఫంక్షన్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మొదలుపెట్టారో అప్పట్నుంచి ఈమె హోస్టుగా చాలా బిజీగా మారిపోయింది. అయితే సుమ కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో ఇష్టపడి సినిమా చేసినప్పటికీ.. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత ఆమె సినిమాల వైపు చూడలేదు.

ముఖ్యంగా స్టార్ హీరోల డేట్స్ ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ స్టార్ హీరోలందరూ సుమా డేట్స్ ఎప్పుడు ఖాళీ అవుతాయో అప్పుడే ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటారు. అయితే ఈమె కాస్త తీరిక తీసుకొని ఒక సినిమాలో యాక్టింగ్ చేస్తోంది. ఆ సినిమా పేరు జయమ్మ పంచాయతీ.. ఈ సినిమాలో యాంకర్ సుమ లుక్స్ చూసిన ఆమె అభిమానులు, సినీ ఇండస్ట్రీలోనే కొంతమంది ప్రముఖులు.. ఆమెకు కరెక్టుగా సూట్ అయ్యే కథ ఇది అని బలంగా తెలియజేశారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో నడుస్తున్న కథ. ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ కూడా విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా పాట విషయానికి వస్తే.. ఈ పాటలో జయమ్మ స్వభావానికి, అచ్చమైన పల్లెటూరి అందాలతో, జయమ్మ చేస్తున్న పంచాయతీ క్యారెక్టర్ మైమరిపించేలా ఉందని చెప్పవచ్చు.. ఇక అంతే కాకుండా తన ఊర్లో ఏం అవసరం కావాలన్నా తనే చూసుకునేలా కనిపిస్తోంది. అలాగే ఊర్లో ఎవరైనా చెడు అలవాట్లకు బానిస అయితే వారికి బుద్ధి చెప్పే విధంగా కూడా కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ తనకు కూడా సహాయం చేయాలనే స్వభావం కలిగే విధంగా కనిపిస్తోంది ఈ వీడియోలో. అయితే ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: