మన టాలీవుడ్ లో అగ్ర హీరోలతో సినిమాలు చేసేటప్పుడు దర్శకనిర్మాతలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఏమాత్రం అజాగ్రత్తగా వహించినా వారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు. గతంలో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ విషయంలో మేకర్స్ ప్రభాస్ ఫాన్స్ కి టార్గెట్ గా మారిన విషయం తెలిసిందే. రాధే శ్యామ్ సినిమా అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆ సంస్థను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ అందరూ ఘోరంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ఫాన్స్ ఆగ్రహానికి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గురైంది. మహేష్ తో 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. 2022 సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా పరిస్థితులవల్ల షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.ఇక ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్న మహేష్ బాబు,కీర్తీ సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ముగ్గురు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నిర్మాతలపై మహేష్ ఫాన్స్ మండిపడుతున్నారు.

చిన్న సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా మూవీ పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్, వంటి అప్డేట్స్ వచ్చాయి. కానీ మహేష్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మీకు బాధ్యత లేదా? అంటూ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు మహేష్ అభిమానులు. కనీసం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయాలేని అంత బిజీగా ఏం చేస్తున్నారంటూ? సోషల్ మీడియాలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రావాల్సి ఉన్నా తమన్ కి కరోనా రావడం వల్ల అది వాయిదా పడింది. దీంతో సంక్రాంతి కానుకగా కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేస్తారని ఫాన్స్ భావిస్తే.. మేకర్స్మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురై.. నిర్మాతల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: