యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి సుమారు మూడేళ్లు కావస్తోంది. ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా 2018 లో విడుదలైంది. ఆ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఎందుకంటే రాజమౌళి  'ఆర్ ఆర్ ఆర్' తో బిజీ అయిపోయారు ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా అంటే చాలా కాలం పడుతుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. అందుకే ఫాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇక 2022లో త్రిబుల్ ఆర్ వస్తుంది అని అనుకున్నారు. కానీ మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 2022 జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయ్యింది.

దీంతో ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయంలో మరింత ఆలస్యం జరుగుతోంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ పాటికే కొరటాల శివ తో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలయ్యేది. కానీ ఇటు 'ఆర్ ఆర్ ఆర్' అటు 'ఆచార్య' ఆలస్యం కావడంతో వీరి కాంబో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం ఇంకా పడుతుంది. ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారు కొరటాల శివ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు కొరటాల శివ. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచంద్రన్ ను కన్ఫామ్ చేశారని.. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమాలో హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ అంటూ ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. ఈ మేరకు పలు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్,ఆలియా భట్ కాంబినేషన్ చాలా క్యూట్గా ఉంటుంది అంటూ ఏకంగా దర్శకుడు కొరటాల శివ కే సజెషన్స్ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో కొరటాల శివ ఏం చేస్తారో తెలియదు. మరి ఫ్యాన్స్, నెటిజన్స్ కోరిక ప్రకారం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జోడీగా ఆలియాభట్ ని తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి. ఇక ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: