నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లకపోయినా ఆమెకి ఇప్పటికి ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి. మధ్యలో కెరియర్ గ్యాప్ వచ్చినా సరే బుల్లితెర డ్యాన్స్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియమణి. ఆ క్రేజ్ తో ఈమధ్య వరుస సినిమాల్లో ఆఫర్లు అందుకుంటుంది ప్రియమణి. సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్స్ తో సత్తా చాటుతుంది ప్రియమణి. ఇక లేటెస్ట్ గా ఆహా కోసం ఓ స్పెషల్ మూవీ చేసింది అదే భామా కలాపం. ఈ వెబ్ మూవీకి సంబందించిన ఫస్త్ గ్లింప్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

ఓ లక్ష సబ్ స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్ లో వంటల ప్రోగ్రాం చేస్తూ వచ్చే ప్రియమణి తన కొత్త వంటకం గురించి చెబుతూ కంగారు పడుతుంది. ఆ వంట ఇంతవరకు తను కూడా ఎప్పుడూ చేయలేదని చెబుతుంది. భామా కలాపం ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ లో వెరైటీ వంటల ద్వారా చాలామంది ఆకట్టుకుంటున్నారు. అదే కాన్సెప్ట్ తో ఈ వెబ్ మూవీ రాబోతుందని అర్ధమవుతుంది. భామా కలాపం మూవీలో ప్రియమణి తన లుక్స్ తో ఇంప్రెస్ చేసింది.

ఎలాగు అవార్డ్ విన్నర్ కాబట్టి ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేయగలుగుతుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో కూడా నటించి నేషనల్ వైడ్ ఆడియెన్స్ ని అలరించిన ప్రియమణి రాబోతున్న భామా కలాపం సినిమాతో కూడా మరోసారి తన సత్తా ఏంటన్నది చాటనుంది. అహా నుండి ప్రతి శుక్రవారం ప్రేక్షకులను అలరించేలా కొత్త సినిమాలు రాబోతున్నాయి. ప్రియమణి సరికొత్త అహా ఒర్జినల్ భామా కలాపం కూడా త్వరలో ఆహాలో రిలీజ్ కానుంది. ఆహా ఆడియెన్స్ కి తిరుగులేని విధంగా ఎంటర్టైనింగ్ అందించేందుకు మంచి కంటెంట్ తో వరుస సినిమాలు చేస్తున్నారు ఆహా టీం.


మరింత సమాచారం తెలుసుకోండి: