టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుష్కను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన చిత్రాల్లో 'అరుంధతి' సినిమాది అగ్రస్థానం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అప్పటివరకు తన అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇచ్చిన ఈ హీరోయిన్.. అరుంధతి సినిమాలో ఏకంగా తన నట విశ్వరూపం చూపించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా అనుష్క జీవితాన్ని మార్చేసింది. అక్కడితో అరుంధతి అంటే అనుష్క... అనుష్కఅంటే అరుంధతి అని ప్రేక్షకుల మనసులో బలంగా ముద్ర పడిపోయింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పై శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాని అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ డైరెక్టర్ చేశారు. 

అనుష్క మెయిన్ లీడ్ గా నటించిన ఈ సినిమా విడుదలై నేటికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ సినిమా ఛాన్స్ మొదట అనుష్కకు రాలేదట. మలయాళం హీరోయిన్ మమతా మోహన్ దాస్ ను అరుంధతి సినిమా కోసం ముందుగా సంప్రదించారట దర్శకనిర్మాతలు. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మమతా మోహన్ దాస్ కు ఎలాంటి కథలు ఎంచుకోవాలనేది పెద్దగా తెలిసేది కాదని.. దానివల్లే ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని గతంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. అంతేకాకుండా అప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో అరుంధతి సినిమాని రిజెక్ట్ చేసిందట.
 

అంతేకాదు ఈ ఆఫర్ వచ్చిన రెండు నెలలకే తనకు క్యాన్సర్ ఉన్నట్లు తేలడంతో సినిమా చేయడం కంటే బతికుంటే చాలనే భావనతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని మమతా మోహన్ దాస్ అప్పట్లో పేర్కొంది. ఇక ఆ తర్వాత అలా ఈ సినిమా అనుష్క దగ్గరకు రావడం.. కథ నచ్చి ఆమె ఓకే చెప్పడంతో సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలెట్టేశారు. ఇక సినిమా విడుదలయ్యాక జేజమ్మగా అనుష్కకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. టాలీవుడ్ లో ఒక విధంగా చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పునాది వేసింది అనుష్క నటించిన అరుంధతి సినిమానే అని చెప్పవచ్చు.ఇక అరుంధతి తర్వాత అనుష్క మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవి అంతగా వర్కవుట్ కాలేదు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: