జాతి రత్నాలు అనగానే ముందుగా మనకు నవీన్ పోలిశెట్టి గుర్తుకొస్తారు.. నవీన్ పోలిశెట్టి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ మొదలుపెట్టి.. ప్రస్తుతం హీరోగా చలామణి అవుతున్నారు. ఇక జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..ఈ టీజర్ మొదలవగానే.. నాయుడు గారు మా హనీమూన్ హవాయి కి టికెట్స్ బుక్ చేశారా..? లేదా..? అంటూ నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్ తోనే ఈ టీజర్ మొదలవుతుంది. చూస్తుంటే నవీన్ పోలిశెట్టి రాజు అనే క్యారెక్టర్ లో చేస్తున్నట్టు ఇక అతనికి పెళ్లికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను నవీన్ పోలిశెట్టి వెల్లడించినట్లు తెలుస్తోంది.. ఇక ఈ టీజర్లో నవీన్ పోలిశెట్టి ఒక ఫోటో షూట్ ను నిర్వహిస్తున్నట్లు అందులో ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు బాగా తీయండి రా ఈ రాజుగాడు ఫోటోలు సోషల్ మీడియాలో పగిలిపోవాలి రా అంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వు తెప్పిస్తాయి..లిటరింగ్ , శివారింగ్, ఫికరింగ్ అంటూ నవీన్ పోలిశెట్టి ఫోజులు ఇస్తుంటే ప్రేక్షకులు బాగా నవ్వుకుంటున్నారు.. పారిజాతం అత్తయ్య.. రేయ్ అత్తయ్యగారు వచ్చారు ఏసీ లు ఆన్ చేయండి రా.. అంటూ ఇలా డైలాగులు చెబుతుంటే నవీన్ పోలిశెట్టి డైలాగ్ డెలివరీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే మళ్ళీ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి నవీన్ పోలిశెట్టి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకునేటట్లు కనిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి కేవలం నటుడు మాత్రమే కాదు స్క్రీన్ రైటర్ కూడా..

2019 లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు.. ఈ సినిమాకి గానూ జీ సినీ అవార్డ్స్ తెలుగు బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక అదే సంవత్సరం హిందీలో  చిచోరే అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఇక విజయ్ దేవరకొండ కు  బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ తెలిసిన విషయమే.నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలుగా నాగ వంశీ సాయి సౌజన్య వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ ఏఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్.ఎస్.తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: