సౌత్ లో దూసుకెళ్తున్న యువ హీరో నిధి అగర్వాల్ ఇప్పుడు వరుస క్రేజీ సినిమాలతో సత్తా చాటుతుంది. కెరియర్ లో ఒక్క ఇస్మార్ట్ శంకర్ హిట్టు మాత్రమే పడినా అమ్మడికి హాట్ ఇమేజ్ బాగా వచ్చేసింది. రీసెంట్ గా సంక్రాంతికి గల్లా అశోక్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిధి. ఈ సినిమాలో నిధి తన గ్లామర్ సైడ్ మరింత రెచ్చిపోయిందని తెలుస్తుంది. గల్లా అశోక్ తొలి పరిచయం కాబట్టి హీరోయిన్ గా నిధి స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆమెని తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఆదిత్యా శ్రీరాం డైరక్షన్ లో తెరకెక్కిన గల్లా అశోక్ హీరో సినిమాలో నిధి అగర్వాల్ కి రెమ్యునరేషన్ గా కోటిన్నర దాకా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంత ఇచ్చారు కాబట్టే అమ్మడు ఈ సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. హీరో సినిమాలో నిధి గ్లామర్ షో అదిరిపోయిందని చెప్పుకుంటున్నారు. హీరోగా అశోక్ ని చూడటానికానా నిధి అగర్వాల్ హాట్ షోకి అందరు ఎట్రాక్ట్ అయ్యేలా డైరక్టర్ అలా ప్లాన్ చేశాడని అంటున్నారు.

నిధి అగర్వాల్ హాట్ షో గల్లా అశోక్ సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. తెలుగుతో కోటికి పైగా తీసుకునే హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ఆమె చేస్తున్న సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. హీరో జస్ట్ ఓకే అనిపించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అమ్మడు చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాకు కూడా నిధి స్పెషల్ క్రేజ్ తెస్తుందని అంటున్నారు. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీ లో బాలీవుడ్ భామ జాక్వెలిన్ కూడా నటిస్తుందని తెలిసిందే. పవన్ సినిమా తో నిధి తన రేంజ్ మరింత పెంచుకోవాలని చూస్తుంది. తప్పకుండా నిధి రాబోయే సినిమాలతో అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: