ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ కెరియర్ లో స్పీడ్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా తమిళ స్టార్ డైరక్టర్ లింగుసామి తో చేస్తున్నాడు. కోలీవుడ్ లో మాస్ అండ్ యాక్షన్ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ ఉన్న లింగుసామి దశాబ్ధ కాలంగా తెలుగు హీరో తో సినిమా చేయాలని ప్రయత్నించగా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఫైనల్ గా రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా లో రామ్ తో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి జోడీ కడుతుంది.

టాలీవుడ్ లో ఇప్పుడు కృతి శెట్టి టైం నడుస్తుంది. ఆమె చేస్తున్న సినిమాలన్ని సక్సెస్ అవడం తో కృతి శెట్టి లక్కీ హీరోయిన్ అయ్యింది. లింగు సామి, రామ్ కాంబినేషన్ లో వస్తున్న తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అసలైతే జనవరి 17న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. కానీ ముందుగానే రామ్ 19వ సినిమా లీక్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటి అంటే వారియర్ అని తెలుస్తుంది.

వారియ అనే పవర్ ఫుల్ టైటిల్ తో రామ్ సినిమా వస్తుంది. ఈ సినిమా లో రామ్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో రామ్ తన లుక్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరియర్ లో మంచి ఫాం లో ఉన్న రామ్ వారియర్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. లింగుసామి కూడా వారియర్ తో తెలుగు, తమిళ భాషల్లో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ రామ్ వారియర్ ఎలా ఉంటాడు. ఆశించిన స్థాయిలో సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: