మొన్నటివరకు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకుని ఓ ఊపు ఊపేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో తన ఫాం కోల్పోయిందని చెప్పొచ్చు. తమిళంలో అసలు ఛాన్సులు రాకపోగా తెలుగులో వచ్చిన అర కొర అవకాశాలు కూడా ఫలితాలు తేడా కొట్టడంతో అమ్మడు వెనకపడ్డది. ఈ క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల మీద తన స్పెషల్ ఫోకస్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈమధ్య తెలుగు సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవడంతో రకుల్ కి మళ్లీ తెలుగు సినిమాల మీద ఆసక్తి పెరిగింది.

రీసెంట్ గా ఓ మీడియా మీట్ లో తనకు తెలుగు.. తమిళం తెలుసని.. సొంత భాష హిందీలో కూడా మాట్లాడుతానని.. కాబట్టి తెలుగు దర్శకులు వారు చేసే పాన్ ఇండియా సినిమాల్లో తనకు అవకాశాలు ఇస్తారని భావిస్తున్నా అన్నది రకుల్ ప్రీత్ సింగ్. ఓ స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇలా ఓపెన్ గా అవకాశాలు అడగడం కొద్దిగా షాకింగ్ గా అనిపించినా సరే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఏమాత్రం మొహమాట పడకుండా అవకాశాలు కావాలని అడిగింది.

తెలుగులో మొన్నటి వరకు స్టార్స్ అందరితో జోడీ కట్టిన రకుల్ ని ఇప్పుడు అందరు పక్కన పెట్టారు. పాన్ ఇండియా సినిమాల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్లీ తానేంటి అన్నది ప్రూవ్ చేస్తానంటుంది రకుల్. మరి అమ్మడికి అలాంటి లక్కీ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. తప్పకుండా రకుల్ అలాంటి ఛాన్స్ ఒకటి పడితే మాత్రం మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం హిందీ సినిమాలతోనే తన కెరియర్ లాగిస్తున్న రకుల్ మంచి పాన్ ఇండియా ఛాన్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. అలాంటి ఛాన్స్ ఒకటి పడితే రకుల్ ఫేట్ మారే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: