ఏపీలో సినిమా టికెట్ల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ని కలిసి న విషయం అందరికి తెల్సిందే. ఈ సంఘటనపై సినీ, రాజకీయ వర్గాల నడుమ పెద్దఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి పలు అంశాలపై చర్చలు జరిపారు. ఇండస్ట్రీ పెద్దగా కాదు సినీ బిడ్డగా జగన్ వద్దకు వెళ్లానని చిరంజీవి తెలిపారు. అయితే చిత్ర పరిశ్రమలో ఉండే సమస్యలపైన మాట్లాడుకున్నామని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై శ్రీరెడ్డి రియాక్ట్ అయిన తీరు పెద్ద దుమారం రేపుతుంది.

అయితే గతంలో కూడా మా ఎన్నికల సమయంలో శ్రీరెడ్డి మెగాఫ్యామిలీపై విరుచుకుపడి వారిపై సంచలన కామెంట్ చేసింది. ఇక శ్రీరెడ్డి మరొకసారి జగన్, చిరంజీవి మీటింగ్ ను ఉద్దేశిస్తూ అలాంటి కామెంట్ చేసింది ఈ భామ. అంతేకాదు.. చిరంజీవి తనకు అయితే అస్సలు నచ్చడని, దానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయంటూ ఓపెన్ గా మాట్లాడింది. అప్పట్లో మీటూ ఉద్యమం జరిగినప్పుడు.. చిరంజీవి ఎలా తొక్కడానికి ట్రై చేశాడని చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. మా అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు తెరచాటున ఉండి పెద్ద వాళ్ల పేర్లు బయటకు రాకుండా చేయడం మరొకటి అయితే.. ఇంకో కారణం తనకు మా సభ్యత్వం రాకుండా ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాడంటూ శ్రీ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. వీరిద్దరూ కలవడంపై శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి ఒక అవకాశవాది అనేస్తూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. మరోవైపు చిరంజీవిని సీఎం పిలిచినా, పిఎం పిలిచినా వెళ్లడం, ఎవరి వైపు బెనిఫిట్ ఉంటే.. అటే వెళ్లడం ఆయనకి అలవాటని తెలిపారు. ఏది ఏమైనప్పటికి చిరంజీవి జగన్ మీట్ లో ఒక విధంగా మంచిదే అయ్యిందని కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: