హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్, నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ హాట్ బ్యూటీ కి  టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది, ఇలా నటించిన ఒకే ఒక్క తెలుగు  సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనూ ఇమాన్యుల్ ప్రస్తుతం మాత్రం ఆరెంజ్ సినిమా అవకాశాలు తగ్గించుకోవడం లేదు అని చెప్పవచ్చు.
 ఈ ముద్దుగుమ్మ తాజాగా శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం సినిమా లో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది.  అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటు అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, అయితే ఎక్కువగా హాట్ ఫోటోలతో కుర్రకారును వేడెక్కిస్తు ఉండే ఈ ముద్దుగుమ్మ ఈసారి చీరకట్టులో క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో అను ఇమ్మాన్యుయేల్ ఎరుపు రంగు చీర కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్ లో ఉన్న ఫోటో ను పోస్ట్ చేసింది, అనూ ఇమాన్యుల్ కు సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: