మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ ప్రతిభ గల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ లో చిరుతో పాటుగా సిద్ధ పాత్రలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నారు. సినిమాలో సిద్ధ పాత్ర మెగా ఫ్యాన్స్ ఊహించిన దానికన్నా పెద్దగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా మెగా ఫ్యాన్స్ అందరిని సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని అంటున్నారు.

కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ ఆచార్యకు స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. ఆచార్య సినిమా అసలైతే ఫిబ్రవరి 4న రిలీజ్ ఎనౌన్స్ చేయగా లేటెస్ట్ గా ఆ సినిమాని ఏప్రిల్ 1న వాయిదా వేస్తూ ప్రకటించారు. ఏప్రిల్ 1 ఉగాది పర్వదినాన ఆచార్య రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే అప్పటివరకు కొవిడ్ కేసుల పరిస్థితి ఎలా ఉంటుందో చూసి సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఆచార్య రిలీజ్ వాయిదా పై యువ హీరో తేజా సజ్జా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

ఆచార్య రిలీజ్ వాయిదా పై తేజా సజ్జా మారింది డేట్ మాత్రమే.. బాక్సాఫీస్ ఫేట్ కాదు.. ఈ ఊగాదికి వసతున్నారు.. ఉత్సవాలకి రెడీ అయిపోండి ఆచార్య మెగా మాస్ ఏప్రిల్ 1న రిలీజ్ అని యువ హీరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈ ట్వీట్ కు తేజా సజ్జాకి సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చిరు నటించిన ఇంద్ర సినిమాలో తొడ కొట్టిన ఆ కుర్రాడే ఈ తేజ సజ్జ. ఈమధ్య ఇతను కూడా హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అద్భుతం అని రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైంది. సినిమాల ఎంపికలో అతను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: