టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అన‌తి కాలంలోనే అంచ‌లంచ‌లుగా ఎదిగి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. మ‌రోవైపు త‌న మొద‌టి సినిమా హీరో నాగ చైత‌న్య‌నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, వీరి బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరిద్ద‌రూ వీడిపోయి.. ఎవ‌రి దారి వారి చూసుకున్నారు. ప్ర‌స్తుతం స‌మంత భాష‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌కు సైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక‌పోతే స‌మంత త‌న ఇన్నెళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసింది. ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఆమె వ‌దులుకున్న చిత్రాల్లో తొంబై శాతానికి పైగా ఫ్లాపులే ఉన్నాయి. మ‌రి సామ్ రిజెక్ట్ చేసిన వాటిల్లో ఓ 5 చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రూస్ లీ: మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మే `బ్రూస్ లీ`. ఈ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత‌ను తీసుకోవాల‌ని మేక‌ర్స్ ఆమెను సంప్ర‌దించార‌ట‌. కానీ, ఆమె నో చెప్ప‌డంతో.. ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ వ‌చ్చింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ 2015 అక్టోబరు 16న విడుద‌లైన ఈ మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.

నిన్ను కోరి: న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన `నిన్ను కోరి` చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం స‌మంత‌కు రాగా.. ఆమె ఈ మూవీని రిజెక్ట్ చేసింది. దాంతో ఆమె బ‌దులుగా నివేదా థామస్ ను తీసుకున్నారు. అయితే 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఫ్లాపైంది.

ఎవడు: రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం `ఎవ‌డు`. వంశీ పైడిపల్లి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సామ్‌ను అడ‌గ‌గా.. ఆమె తిరస్కరించింది. ఇక ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

ఐ: ఎస్.శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో విక్రమ్, ఎమీ జాక్సన్ జంట‌గా న‌టించిన చిత్రం `ఐ`. ఇందులో హీరోయిన్‌గా నటించాలని స‌మంత‌ను కోరినా.. నో చెప్పింది. ఇక భారీ అంచ‌నాల న‌డుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది.

ఎన్టీఆర్ కథానాయకుడు: నందమూరి బాలకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న `ఎన్టీఆర్ కథానాయకుడు`లో ఓ హీరోయిన్ పాత్ర కోసం సామ్‌ను అడిగార‌ట‌. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆమె రిజెక్ట్ చేసింది. క‌ట్ చేస్తే ఈ సినిమా సైతం ఫ్లాపే అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: