సాధారణంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎంత ఆలస్యం జరుగుతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ పరిస్థితుల్లోనే జక్కన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది. అలాంటిది కరోనా వైరస్ సమయంలో ఎంత ఆలస్యం అవుతుంది అన్నది మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించడానికి దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. రాజమౌళి సినిమా చేస్తున్నప్పుడు ఇక ఆ హీరోలు వేరే సినిమా చేయడానికి రాజమౌళి అస్సలు అనుమతించడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లు కేవలం రాజమౌళి సినిమాకు మాత్రమే పరిమితమయ్యారు..


 ఒకరకంగా లెక్కేసుకుంటే రాజమౌళి సినిమా చేసిన సమయంలో దాదాపు నాలుగైదు సినిమాలు చేసేవాళ్ళు హీరోలు. ఇటీవలే విడుదల అవుతుందనుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడడంతో ఇక మిగతా సినిమాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమైపోయారు ఇద్దరు హీరోలు. ఈ క్రమంలో ఇప్పటికే చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ మాత్రం ఏ సినిమా తో ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే దాదాపు ఐదేళ్ల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది.


 ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సారి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసుకుని షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ఇందులో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటించింది ఆలియాభట్.

మరింత సమాచారం తెలుసుకోండి: