కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఏ రేంజ్ క్రేజ్ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. తన టాలెంట్ కి తగిన అవకాశాలను అందుకుంటూ వరుస హిట్లతో స్టార్ ఛాన్సులతో సత్తా చాటుతుంది రష్మిక మందన్న. కన్నడ నుండి వచ్చి తెలుగులో అదరగొట్టేస్తుంది ఈ అమ్మడు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది. పుష్ప హిట్ ని ఫుల్ గా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఈ సినిమాలోని తన పాటకి వస్తున్న వీడియోస్ చూసి తెగ ఎంజాయ్ చేస్తుంది.

పుష్ప సినిమాలో సామీ సామీ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకి చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చేశారు. రష్మికని ఇమిటేట్ చేస్తూ ఆమె వేసినట్టుగా స్టెప్పులు వేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తన జిమ్ ట్రైనర్ కుదీప్ సేతీ కూడా రష్మిక సామీ సాంగ్ ని ఇమిటేట్ చేశాడు. అయితే రోజు జిమ్ లో వర్క్ అవుట్స్ చేసే టైం లో అతను తనని టార్చర్ పెడతాడని.. అయితే ఇప్పుడు సామీ సామీ సాంగ్ ని అతనికి నేర్పిస్తూ తనపై రివెంజ్ తీర్చుకున్నా అంటుంది రష్మిక.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక డీ గ్లామరస్ లుక్ తో అయినా సరే తన పాత్రతో మెప్పించింది. సినిమాలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పుష్ప సినిమాతో రష్మిక కూడా నేషనల్ హీరోయిన్ గా మారింది. ఆమె చేసే ప్రతి సినిమాకు తన పాత్రతో మెప్పిస్తూ వస్తున్న రష్మిక ఫ్యూచర్ లో పాన్ ఇండియా స్టార్ గా అదరగొడుతుందని చెప్పొచ్చు. పుష్ప పార్ట్ 2 తో పాటుగా మరో రెండు పాన్ ఇండియా సినిమాల్లో కూడా రష్మిక పేరు వినపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: