ఎన్నాళ్లని నాచురల్ స్టార్ ఇమేజ్ తో మీడియం రేంజ్ హీరోగా ఉంటామని అనుకున్నాడో ఏమో కానీ నాని తన రీసెంట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ తో తన కెరియర్ లో కొత్త అటెంప్ట్ చేశాడు. సినిమా చూసిన ఆడియెన్స్ అంతా నాని ఈ కథ ఎంపిక చేసినందుకు అతన్ గట్స్ కి మెచ్చుకుంటున్నారు. మొన్నటివరకు పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ఆకట్టుకున్న నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో మంచి వెయిట్ ఉన్న పాత్రలో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చాడు. శ్యామ్ సింగ రాయ్ నాని నమ్మకాన్ని నిజం చేసింది. సినిమా రిలీజ్ టైం లో నాని చెప్పిన మాటలన్ని ఈ సినిమా ప్రూవ్ చేసింది.

అయితే శ్యామ్ సింగ రాయ్ ఇచ్చిన బూస్టింగ్ తో నాని ఇక మీదట తన సినిమాల విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని అంటున్నాడట. డిఫరెంట్ కథలతో కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. శ్యామ్ సింగ రాయ్ నాని కెరియర్ ని కొత్త మార్గంలోకి తీసుకెళ్లేలా చేసిందని అనిపిస్తుంది. నాని తన నెక్స్ట్ సినిమా అంటే సుందరానికీ, దసరా సినిమాలు రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ రెండు సినిమాలని కూడా సౌత్ అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నాని తన పంథా మార్చుకున్నాడు. రొటీన్ రెగ్యులర్ సినిమాలతో వస్తే ఎప్పటికీ అక్కడే ఉండిపోతామని గ్రహించిన నాని సరికొత్త కథలతో వస్తున్నాడు. శ్యామ్ సింగ రాయ్ ఇచ్చిన ఉత్సాహంతో అంటే సుందరానికీ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుండగా శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న దసరా సినిమా మాత్రం అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు. తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో నాని నటన నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటుందని చెప్పుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: