టాలీవుడ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 2016 లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతోపాటు ఈ దర్శకుడికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఇలా అక్కినేని నాగార్జున తో తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మరోసారి అక్కినేని హీరో అయిన నాగ చైతన్య తో రారండోయ్ వేడుక చేద్దాం అనే సినిమాను ఈ దర్శకుడు తెరకెక్కించాడు, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయాన్ని సాధించింది,  అయితే ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ,  మాస్ మహారాజా రవితేజ హీరోగా నేల టికెట్ అనే సినిమాని తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది, అలా నేల టికెట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాఫ్ గా నిలవడంతో, ఈ దర్శకుడు తనకు ఎంతో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన  సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కించాడు.

సినిమా ఈమధ్యనే థియేటర్ లలో విడుదల అయ్యింది,  అయితే ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది,  అయితే ఈ సినిమా ఇలా విజయం సాధించడంతో ఈ దర్శకుడికి అదిరిపోయే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.  ఈ దర్శకుడు తన తదుపరి సినిమా కోలీవుడ్ లో ఫేమస్ ప్రొడక్షన్ కంపెనీ అయిన స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ లో  చేయనున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తో అదిరిపోయే ఛాన్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: