తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. ఇక ఈ హీరో ఉస్తాద్ అయిపోయాడు. రామ్ నటిచించిన రెడ్ సినిమాలో కూడా రామ్ పేరు ముందు ఉస్తాద్ అనే ప్రచురితమైంది. ఇక ఆ పేరుకు న్యాయం చేయడానికి రామ్ తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమాకు అదిరిపోయే మేకోవర్ అయ్యారు. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.

అయితే రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను లింగుస్వామి దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ ది వారియర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్  పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇక ది వారియర్ టైటిల్ బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అంచనాలకు రావచ్చు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ సినీ జీవితంలోనే మొదటిసారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్ తనను తాను చాలా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ ఫోటోలు చూసిన అభిమానులు వామ్మో అంటున్నారు. ఈ లుక్ లో రామ్ పోతినేని అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. అంతేకాదు.. రామ్ కండలు తిరిగిన దేహంతో బళ్లాలదేవుడికి అన్నలా ఉన్నారంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి ఫిజిక్ పరంగా రామ్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ఫొటోస్ చుసిన వారంతా ఫిదా అవుతున్నారు. ఇక లింగుస్వామి సినిమాతో రామ్ తమిళంలో కూడా మార్కెట్ ఓపెన్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా రామ్  సినీ జీవితానికి కీలకంగా మారుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: