సినిమా అంటే లాభ‌న‌ష్టాల మేలుక‌ల‌యిక‌.ఇవాళ డ‌బ్బులు రావొచ్చు లేదా పోవ‌చ్చు కానీ స‌మ‌ష్టిగా ప‌నిచేస్తే అంతా ఒక్క‌టే అన్న భావ‌న క‌లిగిస్తే అఖండ సినిమా అంత‌టి విజ‌యాన్ని ప్ర‌తి సినిమా కూడా సాధిస్తుంది అని చెప్ప‌డంలో సందేహ‌మే లేదు.ఈ విష‌య‌మై రెండో ఆలోచ‌న‌కు తావే లేదు. నాగ్ మాత్రం ఈ విష‌యంలో వెనుక‌బ‌డిపోయారు.ప్రివ్యూ వేసి అయినా ఇండ‌స్ట్రీ మ‌ద్ద‌తు పొందితే ఎంత బాగుండు.కానీ అన్ని అవ‌కాశాలు ఉండి కూడా నాగ్ త‌డ‌బ‌డ్డాడు.దీంతో పాటు సినిమా రిలీజ్ కు ముందు నాగ్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఆర్ఆర్ఆర్ ను ఉద్దేశించి ప‌రోక్షంగా చెప్పిన మాట‌లు (ఎప్ప‌టి నుంచో తీస్తున్న సినిమాల విష‌యంలో ఏమో కానీ నా సినిమాకు ఏపీ లో ఉన్న టికెట్ ధ‌ర‌ల ప్ర‌భావం ఉండ‌దు అని ప‌దే ప‌దే ప‌లికారు మీడియా మైకుల ముందర‌)అన్నీ క‌లిసి బంగార్రాజును కాస్త దెబ్బ‌తీశాయి.ఇమేజ్ ను దెబ్బ తీశాయి.. అదేవిధంగా సినిమాకు సంబంధించి క‌లెక్ష‌న్ గ్రాఫ్ ను కూడా అమాంతం ప‌డేశాయి.అఖండ సినిమావిజ‌యంలో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు నంద‌మూరి ఫ్యాన్స్ ఇరు వైపులా ఉండి స‌హ‌క‌రించారు.అదే బంగార్రాజు మాత్రం ఒంట‌రి అయిపోయాడే ఎందుక‌ని?

ఇండ‌స్ట్రీలో అంతా స‌మాన‌మే అంటారు..ఇండ‌స్ట్రీలో అంతా ఒక్క‌టే అని ఒక చోటనే ఉంటామ‌ని అంటారు.కానీ ఎవ‌రి ఇగోలు వారివి..ఎవ‌రి గోల వారిది.ఇవాళ సినిమా ప‌రిశ్ర‌మ ఆశించిన రీతిలో లేదు.ప‌రిశ్ర‌మ‌కు చాలా క‌ష్టాలు ఉన్నాయి. ఒక‌పక్క ఏపీ ప్ర‌భుత్వంతో త‌గాదాలు తెగ‌డం లేదు.మ‌రోవైపు యాభై శాతం అక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుస్తున్నాయి.ఇక ప్యాన్ ఇండియా అరుపుల మ‌ధ్య ఉత్త‌రాదిలో థియేట‌ర్లే దొర‌క‌డం లేదు. ఎందుకంటే క‌రోనా విజృంభ‌ణ.ఇలాంటి అన‌నుకూల వాతావ‌ర‌ణంలో బంగార్రాజు అనుకున్న స‌మ‌యంలోనే విడుద‌లయినా ఇండ‌స్ట్రీ మ‌ద్ద‌తు మాత్రం ద‌క్క‌లేదు.దీంతో నాగ్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు.ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద‌లులో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా బంగార్రాజుకు మ‌ద్ద‌తుగా ట్వీట్ చేయ‌లేదు.

బంగార్రాజు సినిమా పై ఇండ‌స్ట్రీలో ఎటువంటి కామెంట్లూ రాలేదు. ఎందుక‌నోకానీ ఈ సినిమా విష‌య‌మై ఎవ్వ‌రూ పెద్ద‌గా స్పందించ‌లేదు.ఇదే  స‌మ‌యంలో దిల్ రాజు అన్న కొడుకు హీరో గా చేసిన రౌడీ బోయ్స్ పై మాత్రం మంచి హైప్ వ‌చ్చింది. ఇందుకు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా బాగానే హెల్ప్ చేశారు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిన్న సినిమాకు ఊతం ఇద్దామ‌న్న ఉద్దేశంతో ఇండ‌స్ట్రీలో రాజ‌మౌళి లాంటి పెద్ద‌లు ప‌నిచేసినా కూడా బంగార్రాజుకు కూడా ఎంతో కొంత మ‌ద్ద‌తిస్తే క‌లెక్ష‌న్ల ప‌రంగా మేలు అయి ఉండేది.కానీ బంగార్రాజు విష‌యంలో ఎటువంటి ప్ర‌మోష‌న్ కూడా చేయ‌లేదు రాజ‌మౌళి. అదేవిధంగా సినిమాపై ఎటువంటి కామెంట్ చేయ‌లేదు చిరంజీవి.ఎందుక‌ని?



మరింత సమాచారం తెలుసుకోండి: