ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ గా కొనసాగుతుంది సాయిపల్లవి. ఏది పడితే అది చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకుల  ముందుకు వస్తుంది. ఇక సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటించింది అంటే చాలు ఈ కథలో బలం ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు. అంతలా సాయి పల్లవి తన సినిమాల ఎంపికతో ప్రేక్షకుల్లో ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇక ఇటీవలే లవ్ స్టోరీ అనే ఫీల్ గుడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


 ఇక దగ్గుబాటి వారసుడు రానాతో కలిసి నటించిన విరాటపర్వం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను సాయిపల్లవి మెస్మరైజ్  చేయబోతోంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.. ఇక పోతే ఇప్పుడు క్యూట్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక స్టార్ హీరో కి చెల్లెలు గా నటించేందుకు సాయి పల్లవి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా మరికొన్ని రోజుల్లో పెట్టాలెక్కబోతుంది.


 అయితే సిస్టర్ సెంటిమెంట్ తో ఇక ఈ సినిమా రూపొందబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హీరో చెల్లెలి పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా మారనుందట. ఈ పాత్ర కోసం అద్భుతమైన నటనతో ఆకట్టుకునే సాయిపల్లవి అయితే బాగుంటుందని అనుకున్న చిత్రబృందం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చిరంజీవి బోలా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటించే అవకాశం వచ్చినప్పటికీ రీమేక్ సినిమా కావడంతో సాయిపల్లవి రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం మహేష్ బాబు చెల్లెలిగా నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదట సాయి పల్లవి. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించబోతుందట. అయితే మహేష్ బాబు సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలనుకున్న ప్రేక్షకులకు ఇక ఇప్పుడు సాయి పల్లవి ఏకంగా మహేష్ చెల్లెలిగా నటిస్తుండటంతో షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: