నితిన్ హీరోగా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు ఫ్లాపులు తన ఖాతా లో వేసుకుని ఇప్పుడు తప్పకుండా విజయం అందుకోవలసిన సమయంలో నితిన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. టైటిల్ ను బట్టి ఇది ఒక పొలిటికల్ థ్రిల్ల ర్ సినిమా అని తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టి శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు ముస్తాబు అవుతుంది. భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టిన తరువాత నితిన్ చేసే సినిమాలపై భారీ క్రేజ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఆయన భీష్మ చిత్రం తర్వాత చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిత్రం డిజాస్టర్ మూవీ గా నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చే రంగ్ దే సినిమా అయినా నితిన్ ఆశించిన విజయాన్ని తీసుకు వస్తుందని అభిమానులు ఎదురు చూడగా అదికూడా పేలవమైన సినిమాగానే తేల్చేశారు ప్రేక్షకులు. దాంతో తప్పకుండా ఈసారి చేయబోయే సినిమాతో హిట్ కొట్ట వలసిన పరిస్థితి నితిన్ కు వచ్చింది.

ఇకపోతే మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ ప్రముఖ రచయిత దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నాడు ఈ దర్శకుడు. దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులను కూడా సెలెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు గా హరీష్ జయరాజ్ ను ఎంపిక చేసుకుంది చిత్రబృందం. మరి తమిళం లో అగ్ర హీరోలకు సంగీతం అందించిన హరీష్ జయరాజ్ ఇప్పుడు ఈ హీరో కి ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: