జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ తన వైపు చూసేలా చేసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. ఆ సినిమాలో ఆయన నటించిన తీరుకు ప్రేక్షక లోకం ముగ్ధులై పోయిందని చెప్పాలి. పక్కింటి కుర్రాడు సినిమాలో నటించిన విధంగా నవీన్ పోలిశెట్టి ఆ సినిమాలో నటించి అందరికి బాగా దగ్గర అయిపోయాడు. అంతకుముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో మంచి సక్సెస్ ను సాధించి డిఫరెంట్ హీరో గా తనను తాను ప్రేక్షకుల వద్ద పరిచయం చేసుకున్నాడు.

అంతకు ముందు కొన్ని పాత్రల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో తనలో ఇంత టాలెంట్ ఉందని తొలి సినిమాతోనే నిరూపించుకొని రెండో సినిమాతో భారీ స్థాయిలో ఇమేజ్ దక్కించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా సౌత్ సినిమా పరిశ్రమలోని నిర్మాతలందరూ ఈ హీరోతో సినిమాలు చేయాలని భావించారు. నవీన్ పోలిశెట్టి కూడా హడావుడిగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి కదా అని సినిమాలు చేసేయలేదు. మంచి కథలు ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ వాటి కోసం ఎదురు చూశాడు. అలా ఆయన ఇటీవలే ఓ సినిమా అనౌన్స్ చేసి త్వరలోనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా అని చెప్పకనే చెప్పాడు.

అనగనగా ఒక రాజు అనే సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఒక వీడియో ని కూడా వదిలాడు ఈ యంగ్ హీరో. దీనిలో నవీన్ పోలిశెట్టి పాత్ర పెళ్లి గురించి సినిమా మొత్తం ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ వీడియో ద్వారా సినిమా యొక్క పూర్తి ఇతి వృత్తాన్ని వెల్లడించాడు అనే చెప్పాలి. ఈ విధమైన ప్రయోగం చేయడం ద్వారా నవీన్ పోలిశెట్టి కి మంచి విజయం చేకూర్చాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన స్టైల్ లో తనకే సొంతమైన నటనతో ఆయన ఈ వీడియోలో నటించిన తీరు చూస్తుంటే సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: