సౌత్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా దశాబ్దకాలం నుంచి వెలుగొందుతుంది హీరోయిన్ నయనతార. తమిళ తెలుగు కన్నడ మలయాళ సినిమాల్లో సినిమాలు చేస్తూ భారీ క్రేజ్ అందుకు కే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు ఎదురు లేదు అనే విధంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు అన్ని భాషలలోనూ చేస్తూ నయనతార పాపులారిటీని అంతకంతకూ పెంచేశారు నిర్మాతలు. ఆమె కు ఓ చిన్నపాటి హీరో కున్న మార్కెట్ ఉండడంతో ఆమెతో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడ్డారు.

ప్రేక్షకులను కూడా నయనతార సినిమాలను విపరీతంగా అలరించడం తో ఆమెకు లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా వచ్చింది. నయనతార గత కొన్ని రోజులుగా ఆమె ప్రియుడితో లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. తొందరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతున్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని పూర్తి చేసిన వెంటనే పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆమె తరువాత ఎవరూ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తారని చర్చ ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా జరుగుతుంది. 

అలా ఇప్పుడు అందరి దృష్టి సమంత మీద కు మళ్ళుతుంది. ఇటీవలే ఆమె పుష్ప చిత్రంలోనీ ఐటం సాంగులో చేసి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించుకుంది. ఇప్పటి వరకు సౌత్ లో మాత్రమే ఆమె కు భారీ క్రేజ్ ఉండగా ఈ పాట విడుదల అయిన తర్వాత దేశమంతటా ఆమె కీర్తి పాకిపోయింది. అలా నయనతారను వెనక్కి నెట్టేసి ఈ ముద్దుగుమ్మ సౌత్లో నెంబర్ వన్ హీరోయిన్ గా అవతరించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లుగా సౌత్ సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఒకటి రెండు సినిమాలు విడుదల అయ్యి అన్ని భాషలలో సక్సెస్ సాధిస్తే నిజంగా సమంత ఈ రూమర్ ని నిజం చేసే వచ్చు అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: