పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసిన ఓ దర్శకుడు మళ్లీ తెలుగులో సినిమా చేయడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన నటుడిగా స్థిరపడడంతో తమిళ సినిమా పరిశ్రమలో కూడా దర్శకుడిగా సినిమాలు చేయకపోవడంతో దర్శకత్వానికి గుడ్ బై చెప్పేసాడు ఏమో అని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు అనే వార్త ఆయన అభిమానులు ఎంతగానో ఖుషీ చేస్తుంది. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.. పవన్ కళ్యాణ్ ఖుషి మరియు కొమరంపులి అనే రెండు సినిమాలు చేసిన దర్శకుడు ఎస్ జే సూర్య. 

దర్శకుడిగా సినిమా పరిశ్రమలో తన కెరీర్ ను ప్రారంభించి ఇప్పటివరకు ఎన్నో సినిమాలను తెరకెక్కించి భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానాన్ని పొందాడు సూర్య. తెలుగులో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలను డైరెక్ట్ చేసి ఇక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ దర్శకుడు తెలుగులో కొమరం పులి సినిమా చేసిన తర్వాత మళ్లీ దర్శకత్వం చేయలేదు. సరదాకి ఆయన నటించడం మొదలు పెట్టి నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం తో ఇప్పుడు దాన్ని ఫుల్ టైం జాబ్ గా చేస్తున్నాడు.

మహేష్ బాబు స్పైడర్ సినిమా లో కూడా విలన్ గా చేసిన ఈ దర్శకుడు తనకు వస్తున్న అవకాశాలను గమనించి దర్శకత్వాన్ని పక్కనపెట్టి ఎక్కువగా నటుడిగానే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తమిళ సినిమా పరిశ్రమలో ఆయన ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేశారు. తెలుగులో కూడా ఈ నటుడు ని కొన్ని ముఖ్యమైన పాత్రలలో నటింప చేసే ఆలోచనలో మన దర్శక నిర్మాతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సూర్య తొందర్లోనే తెలుగు సినిమాకి దర్శకత్వం వహించే ఆలోచన చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే ఇందులో ఎవరు హీరోగా నటిస్తున్నారు దాని వివరాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అవుతాయి అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: