సమంత రూత్ ప్రభు పేరు దాదాపుగా తెలుగు, తమిళ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ విధంగా ఆ భాషల ఆడియన్స్ తో పాటు ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2లో పోషించిన రాజీ పాత్ర ద్వారా ఏకంగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన సమంత, కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్పలో ఒక ప్రత్యేక సాంగ్ చేసి అందరినీ మరింతగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె శాకుంతలం తో పాటు యశోద అనే పాన్ ఇండియా సినెమాలు చేస్తున్నారు. ఇక వీటితో పాటు త్వరలో ఆమె మరొక హాలీవుడ్ సినిమా కూడా చేయనున్న విషయం తెలిసిందే.

తొలిసారిగా ఏ మాయ చేసావే మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలోని జెస్సీ పాత్రతో అందరి మనసులు దోచుకున్న సమంత అక్కడి నుండి అనేక విజయవంతమైన సినిమాలు చేస్తి టాలీవుడ్ లో నటిగా తనకంటూ మంచి పేరు సంపాదించారు. అలానే అటు తమిళ్ లో కూడా పలు సూపర్ హిట్స్ లో నటించిన సమంత కెరీర్ లో చేసిన అనేక సినిమాల్లో ఎక్కువ విజయాలు తన ఖాతాలో వేసుకున్న గోల్డెన్ హీరోయిన్ గా కూడా పేరు అందుకున్నారు. అయితే ఇటీవల భర్త నాగ చైతన్య నుండి విడిపోయి ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి జీవిస్తున్న సమంత, వాస్తవానికి తన విడాకుల సమయంలో ఎంతో మానసికంగా కృంగిపోయానని అన్నారు.

అయితే అనంతరం దాని నుండి బయటపడేందుకు ఎక్కువగా కెరీర్ పై దృష్టి పెట్టడంతో పాటు మనసుని మరింత బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించానని, మెల్లగా అంతా తన అదుపులోకి రావడంతో పాటు ప్రస్తుతం తన లైఫ్ లో ఎంతో మార్పు వచ్చిందని ఆమె ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో కఠినమైన సమయం అనేది ఉంటుందని, కానీ దానిని అధిగమించి ధృడంగా కనుక ముందుకు సాగగలిగితే ఆపైన అంతా అదుపులోకి వస్తుందని, అలానే తప్పకుండ రాబోయే రోజులన్నీ మనవే అవుతాయని ఆమె అన్నారు. ఇక కెరీర్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న తాను, తన కష్ట సమయంలో తోడుగా నిలిచిన కుటుంబసభ్యులు, సన్నిహితులని ఎప్పటికీ మరువలేనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: