ఇగోలు అటుంచి అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తే ఓ సినిమా ఏ విధంగా మంచి ఫ‌లితం సాధిస్తుందో నిరూపించాడు బాలయ్య.అఖండ సినిమా విష‌యంలో నంద‌మూరి కుటుంబానికి అండ‌గా ఉన్నారు బ‌న్నీ ఫ్యాన్స్. క‌ష్ట‌కాలంలో ఉన్న ప‌రిశ్ర‌మ‌కు అఖండ విజ‌యం అటుపై వెంట‌వెంట‌నే వ‌చ్చిన పుష్ప విజ‌యం కొత్త ఊపిరినిచ్చాయి.కొత్త దారుల‌కు అవ‌కాశం ఇచ్చాయి. ఆ విధంగా ఆ రెండు సినిమాలు సెన్సేష‌న్ హిట్ ను న‌మోదు చేశాయి.వ‌సూళ్ల ప‌రంగా  అనూహ్య రీతిలో రికార్డులు న‌మోదు చేశాయి.ఆ జోరు సీక్వెల్ సోగ్గాడు కొనసాగించ‌లేకపోయాడు.ఎందుకంటే బంగార్రాజుకు ఆశించిన మానియా లేదు. విదేశాల్లో ఓపెనింగ్స్ అన్నీ నిరాశ‌జ‌న‌క‌మే! అఖండ‌ను,పుష్ప‌ను ఆదుకున్న విదేశీ మార్కెట్సినిమా విష‌యంలో మాత్రం అస్స‌లు అనుకూలించ‌క‌పోవ‌డం నిజంగానే నాగ్ కు ఓ పెద్ద నిరాశ.
 
బంగార్రాజు సినిమా విడుద‌ల‌యి మంచి క‌లెక్ష‌న్లే ద‌క్కించుకుంది.సినిమా ప‌రంగా మొద‌టి నుంచి పాజిటివ్ టాక్ ఉన్న‌ప్ప‌టికీ రిలీజ్ అయ్యాక ఆ టాక్ ను మ‌రింత కంటిన్యూ చేసేందుకు నాగ్ కష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. ఎందుకంటే ముందు సినిమా సోగ్గాడేలో చేసిన మ్యాజిక్ ఈ సినిమాలో లేదు. పాట‌లు ఆ సినిమా రేంజ్ లో కూడా లేవు.ఓ విధంగా సోగ్గాడే మ్యాజిక్ ను రిపీట్ చేయ‌డ‌మే క‌ష్టం అని తేలిపోయింది.

సీనియ‌ర్ యాక్ట‌ర్లు ఎందరున్నా త‌న‌కు ఎదురేలేద‌ని నిరూపించుకునేందుకు నాగ్ చేసిన పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉంది అని చెప్ప‌డం మాత్రం అతిశ‌యం కాదు.ఆయ‌న క‌ష్టం ఈ సినిమాలో ప్ర‌తిచోటా క‌నిపించింది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ కూడా ఆ విధంగానే నాగ్ స్థాయిని, జీ స్టూడియోస్ స్థాయిని అద్దం ప‌ట్టేలానే ఉన్నాయి. ఇన్ని బాగున్నా సినిమాకు అనుకున్నంత ఇమేజ్ లేదు. ఎందుకంటే ఈ సినిమా విష‌య‌మై నాగ్ అంద‌రినీ క‌లుపుకుని పోక‌పోవ‌డ‌మే!

అఖండ సినిమా ప్రిరిలీజ్ వేడుక‌ల‌కు బ‌న్నీ అటెండ్ అయ్యాడు.సినిమా కు సంబంధించి అదేవిధంగా నంద‌మూరి కుటుంబంతో త‌మకు ఉన్న అనుబంధం గురించి చెప్పాడు.ఆఖ‌రులో ఫ్యాన్స్ కోరిక మేర‌కు జై బాల‌య్య అని నిన‌దించాడు.అదేవిధంగా పుష్ప సినిమా విష‌యంలో రాజ‌మౌళి వ‌చ్చి మాట్లాడి వెళ్లాడు. సినిమా హైప్ పెంచాడు కూడా! కొర‌టాల లాంటి వారు కూడా పుష్ప వేడుక‌ల్లో సంద‌డి చేసి అభిమానుల‌ను అల‌రించారు.ఈ రెండు సినిమాలూ ఆవిధంగా అంద‌రినీ క‌లుపుకుని వెళ్ల‌గా నాగ్ మాత్రం ఒంట‌రిగానే మిగిలిపోయాడు.దీంతో క‌లెక్ష‌న్ గ్రాఫ్ ఒక్క‌సారిగా ఆశించినంత లేదు.వాళ్లేవో లెక్క‌లు చెబుతున్నా అవ‌న్నీ ఎంత‌వ‌ర‌కూ నిజ‌మో మ‌రి కొద్ది రోజులు ఆగితే తేలిపోనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: