ఏ సినీ ఇండస్ట్రీలో నైనా క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే విషయం ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోతున్నారు.. కొంతమంది ఇది తమ తమ ఇండస్ట్రీలో చెప్పకుండా ఇతర ఇండస్ట్రీల పేరు సైతం చెబుతూ.. ఉంటారు. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు ఎంతో మంది నటీమణులు, వారు ఎదుర్కొన్న కష్టాలను కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అప్సర రాణి ని కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెను కోరిక తీర్చమంటూ వేధించేవారట.. ఈమె థ్రిల్లర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇకపోతే ఆమె ఎదుర్కొన్న క్యాష్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు చూద్దాం.

థ్రిల్లర్ మూవీ తో మంచి ఇమేజ్ ను దక్కించుకుంది అప్సర రాణి.. ఇక ఆ తరువాత క్రాక్ సినిమాలో ఐటెం గర్ల్ గా నటించి మరింత దగ్గరయింది. అయితే ఇప్పుడు ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతోంది. అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. అప్సర రాణి మాట్లాడుతూ.. కన్నడ ఇండస్ట్రీ లో ఓ మూవీలో నటించే అవకాశాకీ ఎంపిక అయిందట అప్సర రాణి.. ఇక ఆ సినిమా కథ వినే దాని కోసం డైరెక్టర్ తనని ఒంటరిగా  రూమ్ కి రమ్మని పిలిచారట.. అంతే కాకుండా డైరెక్ట్ గా తన ముందరే కోరిక తీరిస్తేనే అవకాశం ఇస్తానని తెలియజేశాడట ఆ డైరెక్టర్.. కానీ ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ.

కానీ ఈమె తెలివి చేసి అక్కడికి తన తండ్రిని వెంట తీసుకొని వెళ్లిందట.. ఈ విషయం తెలుసుకున్న  డైరెక్టర్ అక్కడి నుంచి పారిపోయాడు అంటూ తెలియజేసింది. తెలుగు పరిశ్రమలో మాత్రం తనకి ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని తెలియజేసింది.. కేవలం ఇక్కడ టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు బాగానే ఉంటాయని చెప్పుకొచ్చింది. గోపీచంద్ తో కూడా సీటీ మార్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: