రాధే శ్యామ్ కొత్త తేదీ.. సరైనదేనా..ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం అభిమానుల వంతు అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మార్చి 14వ తేదీన విడుదల చేయబోతున్నామని న్యూస్ రావడం ఇప్పుడు ప్రభాస్ అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది.

వాస్తవానికి కరోనా ఉందన్న కారణంతోనే ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు చిత్రబృందం. కానీ మార్చి 14వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయడం పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అభిమానులలో. అప్పటివరకు కరోనా ఎలాంటి ప్రమాదం చేయకుండా ఉంటుందా అని అనుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమాను ఇంత త్వరగా విడుదల చేయడం పట్ల వారు కొంత సంశయిస్తున్నారు. ఏదేమైనా మార్చి 14వ తేదీన సినిమా విడుదలైతే మాత్రం తప్పకుండా అది మంచి తేదీనే అవుతుంది అని మరొక వర్గం చెబుతోంది.

అంతేకాదు సోలోగా విడుదల అవడం వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా వస్తాయని భావిస్తున్నారు. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా  పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఆస్ట్రాలజర్ గా ప్రభాస్ నటిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నిలిపాయి. మరి మార్చి 14 తేదిన ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని చెబుతున్న ఈ సినిమా ఆ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి స్థాయిలో వారిని అలరిస్తుందో చూడాలి.  ఇక పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: