టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ హీరోలలో ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో పవర్ఫుల్ అరంగేట్రం చేసిన ఈ హీరో గత ఏడాది విడుదలైన 'జాతి రత్నాలు' సినిమాతో తన కెరీర్లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్ ని అందుకున్నాడు.ఇక ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించిన తర్వాత దర్శకుడు అనుదీప్ కెవి సీక్వెల్‌ను కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇంకా ఆ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ అనేది రాలేదు. ఇటీవల, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో నవీన్ సినిమా హోల్డ్‌లో ఉందనే వార్తలు కూడా వచ్చాయి.సినిమా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వచ్చింది.కానీ అటువంటి రూమర్స్ కు యూవీ క్రియేషన్స్ సంస్థ చెక్ పెట్టేసింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే వెల్లడి కానున్నాయి. అలాగే త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ ఇంకా నాగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఈ హీరో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల అఫీషియల్ గా మరో క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 ఇక ఈ సినిమాలకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. తన రాబోయే సినిమాల కోసం ఈ జాతి రత్నం ఏకంగా 5 నుంచి 6 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకోనున్నట్లు టాక్ అనేది వస్తోంది.ఈ టాలీవుడ్ జాతి రత్నం తన మూడవ సినిమా నుంచే ఇంత భారీ పారితోషికం అందుకోవడంతో విషయం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా జాతిరత్నాలు సినిమాతో నవీన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి. జాతి రత్నాలు సినిమా పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో లాభాలను అందించింది.ఈ సినిమా ఏకంగా 30కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో నిర్మాతలు అతని డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా నవీన్ పోలిశెట్టి ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.ఇలా మంచి ఫాంలో వున్నప్పుడే రెమ్యూనరేషన్ పెంచి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు నవీన్ పోలిశెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: