నందమూరి నటసింహం బాలకృష్ణ ఇంకా బోయపాటి శ్రీనుల అఖండ అద్భుతమైన రన్‌తో ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. బాలకృష్ణ తొలి 150 కోట్ల సినిమాగా అఖండ సినిమా నిలిచింది.ఇక ఈ సినిమా 45వ రోజున కూడా ఏపీ ఇంకా తెలంగాణల్లోని చాలా సెంటర్లలో హౌస్‌ఫుల్‌గా రికార్డులను సృష్టించింది. ఇతర కేంద్రాలలో కూడా మాస్ ఇంకా కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమాకి కలెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి. 45వ రోజు కూడా హౌస్‌ ఫుల్‌గా రికార్డు సృష్టించిన సినిమా అంటే ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఇది అతిపెద్ద ఘనత అనే చెప్పాలి.ఇక బాలయ్య ఇంకా బోయపాటి కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. ఇక మరికొందరు సీనియర్ దర్శకులు కూడా నందమూరి బాలకృష్ణతో అదే తరహాలో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి దర్శకులలో బాలయ్యకు ఇండస్ట్రీ ఇచ్చి పెద్ద స్టార్ ని చేసిన బి.గోపాల్ కూడా ఉన్నారు. ఆయన గతంలో బాలయ్యతో చేసిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి.

లారీ డ్రైవర్, రౌడి ఇన్స్పెక్టర్ ఇంకా నరసింహా నాయుడు లాంటి సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసి బాలకృష్ణ మార్కెట్ ను కూడా అమాంతంగా పెంచేశాయి.అయితే బి.గోపాల్ కూడా బాల కృష్ణతో మరో సినిమా చేయాలని గత పదేళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మంచి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో వీరి కాంబినేషన్ కుదరడం లేదు. ఆ మధ్య కాలంలో బి.గోపాల్ ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర తో మాట్లాడి కథను అందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఆయనతో కూడా ఈ సీనియర్ దర్శకుడు చాలాసార్లు సిట్టింగ్ వేసి పూర్తి కథ కూడా రెడీ అయినట్లు టాక్ వచ్చింది.

కానీ బాల కృష్ణ మాత్రం ఆ ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో వెంటనే దాన్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే బి.గోపాల్ ను నిరాశపరచకుండా తప్పకుండా మరో కథను తీసుకు రండి అని బాలయ్య బాబు చెప్పాడట. ఇక బి.గోపాల్ కూడా బాలయ్యతోనే సినిమా చేయాలని మరికొందరు రైటర్స్ తో కలిసి కథ చర్చలు కూడా బలంగా మొదలు పెట్టినట్లు సమాచారం తెలుస్తుంది. మరి ఈ ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: