టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను తీసిన అఖండ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ తరువాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్, బి గోపాల్ వంటి దర్శకులతో కూడా వరుసగా సినిమాలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ సైతం ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ విషయమై ఒక ఇంటర్వ్యూ లో బాలకృష్ణ మాట్లాడుతూ, తన దర్శకత్వంలోనే ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఆదిత్య 999 మూవీ ద్వారా మోక్షజ్ఞ హీరోగా లాంచ్ కానున్నాడని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని బాలకృష్ణ అన్నారు. కాగా మొన్నటి సంక్రాంతి పండుగ వేడుకల్ని కారంచేడులోని తన సోదరి పురంధేశ్వరి ఇంట్లో కుటుంబసమేతంగా వెళ్లి జరుపుకున్నారు బాలకృష్ణ. ఆ సందర్భంగా బాలకృష్ణతో పాటు ఆయన కొడుకు మోక్షజ్ఞ కూడా ఆ వేడుకల్లో సందడి చేసారు.

విషయం ఏమిటంటే, అందులో మోక్షజ్ఞని చూసిన పలువురు అతడు అసలు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడో ఏమో అంటూ అభిప్రాయపడుతుండగా పలువురు బాలకృష్ణ సన్నిహితుల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అతి త్వరలో మోక్షజ్ఞ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ సహా పలు ఇతర బాడీ బిల్డింగ్ వంటివి ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టనున్నారని, ఇప్పటికే అతడికి సంబంధించి అన్ని విషయాల గురించి బాలకృష్ణ మరోవైపు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారట. ఇక ఆయన మూవీ వచ్చే ఏడాదికి సంక్రాంతికి మొదలవుతుందని అంటున్నారట. ఈలోపు సినిమా స్క్రిప్ట్ తో పాటు అన్ని అంశాలు సిద్ధం అవుతాయని, ఈ మూవీని రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై బాలయ్య నిర్మిస్తారని టాక్. మరి ఇదే కనుక నిజం అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: