చాలా మంది నటులు బుల్లితెరపై తమ ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటున్నారు. ఆ నటుల గురించి ఒక్కసారి చుద్దామా. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నటిస్తున్న నటి నయనతార. ఈ భామ వెండితెర కంటే ముందుగా బుల్లితెరపై యాంకర్ గా పని చేశారు. ఆమె యాంకర్ గా చేస్తున్న సమయంలోనే మన సింగారి అనే సినిమాలో అవకాశం రావడంతో వెండితెరకు పరిచయమైంది. అప్పటి నుండి ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలలో ఆమె సత్తా చాటుతుంది.

అలాగే ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమయ్యే కన్నడ సీరియల్స్ లో నటించారు. ఆ తరువాత ఆయనకీ 1988లో సినిమా ఆఫర్ రావడంతో ఇక అక్కడి నుంచి ప్రకాష్ రాజ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకి దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి హన్సిక. ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ బుల్లితెరపై స్టార్ట్ చేసింది. అనంతరం సినిమాలో అడుగు పెట్టింది ఈ భామ.

కన్నడ సినీ పరిశ్రమ స్థాయి పెంచిన సినిమా కే జి ఎఫ్. ఈ సినిమాలో హీరోగా యష్ నటించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయిన యష్ కెరియర్ కూడా బుల్లితెర పైనే స్టార్ట్ చేశాడు. ఆయన కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించి 2007లో ఓ సినిమాలో వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు.. చిత్ర పరిశ్రమలో మాధవన్ అన్ని భాషలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన వెండితెరకు పరిచయం కావడానికి ముందు బుల్లితెరపై హిందీ సీరియల్స్ లో నటించాడు.

తమిళ్ హీరో శివ కార్తికేయన్ కూడా మొదట బుల్లితెర పై స్టాండప్ కమెడియన్ గా రాణించారు. అంతేకాదు.. తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించిన మరో హీరో  విజయ్ సేతుపతి. ఆయన కూడా సన్ టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు.  ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సాయి పల్లవి బుల్లితెరపై ఓ డాన్స్ కంటెస్టెంట్ గా రాణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: