వివాదాలకు నిరంతరం చిరునామాగా కొనసాగడం ప్రకాష్ రాజ్ అలవాటు. ఆ మధ్య జరిగిన ‘మా’ సంస్థ ఎన్నికలు వివాదాలు తరువాత గతకొంత కాలంగా ప్రకాష్ రాజ్ సంచలన వార్తలకు దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం పై చాలామంది స్పందిస్తున్నా ప్రకాష్ రాజ్ మాత్రం మౌనాన్ని కొనసాగిస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో ఈ విలక్షణ నటుడు మళ్ళీ ఇండస్ట్రీ గాసిప్పులలోకి వచ్చాడు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ తో ‘రంగమార్తాండ’ అనే మూవీని మొదలుపెట్టాడు. జాతీయ స్థాయి అవార్డు పొందిన మరాఠి సినిమా ‘నటసామ్రాట్’ మూవీకి ఇది రీమేక్. ఒక రంగస్థల కళాకారుడి జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయో చెప్పే ఆసక్తికరమైన ఈ మూవీ కథ చాల సహజంగా ఉంటుంది అంటున్నారు.


ప్రకాష్ రాజ్ కి ఈమూవీ కథ బాగా నచ్చడంతో కృష్ణవంశీకి చెప్పి ఆమూవీకి కృష్ణవంశీని దర్శక నిర్మాతగా మార్చి ఆమూవీని ప్రారంభించే విధంగా చేసాడు అని అంటారు. మొదట్లో ఈమూవీకి ప్రకాష్ రాజ్ కూడ సహ నిర్మాత అన్నవార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ ఈమూవీ ప్రాజెక్ట్ సహ నిర్మాణ బాధ్యతల నుండి ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  


కరోనా ఫస్ట్ వేవ్ ముందు ప్రారంభం అయిన ఈమూవీ ఇప్పటికీ ముగింపు దశకు చేరుకోక పోవడంతో కృష్ణవంశీ ఈమూవీని ఎదోవిధంగా వేగంగా పూర్తీ చేయాలని చేస్తున్న ప్రయత్నాలకు ప్రకాష్ రాజ్ నుండి సహకారం లభించడం లేదు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతున్న ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ కు ప్రకాష్ రాజ్ సరిగ్గా రావడం లేదని దీనితో షూటింగ్ ఖర్చు అంతా వృధా అవుతోందని అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ ల మధ్య ఏమైంది అంటూ ఇండస్ట్రీలో మళ్ళీ గుసగుసలు వినిపిస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: