వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అద్భుతంగా, మెప్పించగలిగే నటులలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇక కేవలం కొన్ని పాత్రలు సీనియర్ ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుందని చెప్పవచ్చు. అటు రాజకీయంగా ఇటు సినిమాలలో ఎటు చూసినా ఆయన మహానటుడు గానే పేరుపొందాడు. ఎన్టీఆర్ కేవలం పౌరాణిక క్యారెక్టర్ లలోనే కాకుండా.. జానపద, చారిత్రక మూవీ లలో కూడా నటిస్తూ ఆ పాత్రని పరిపూర్ణము చేసేవారు. అందుచేతనే సినీ ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయకుడుగా పేరుపొందాడు. అలా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ కి పద్మశ్రీ అనే బిరుదు కూడా కలదు.. ఎన్టీఆర్ నటుడిగా మాత్రమే కాకుండా.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, పొలిటికల్ నేతగా.. ఎవరు చేయలేనన్ని  అసాధ్యమైన రికార్డులను సృష్టించారు ఎన్టీఆర్. అందుచేతనే ఎన్టీఆర్ ని ప్రజలందరూ ఎక్కువగా అన్నా అని పిలుస్తూ ఉంటారు. చిన్నప్పుడు నుంచి నాటకాల మీద ఎక్కువ ఇష్టం ఉండడంతో.. బాగా నాటకాలు వేస్తున్న సమయంలో ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ కి పల్లెటూరి పిల్ల అనే సినిమాలో మొట్టమొదటి సారిగా అవకాశం ఇవ్వడం జరిగింది.. కానీ ఈ సినిమా కాస్త లేట్ కావడంతో.. మరొక డైరెక్టర్ తో వచ్చిన మన దేశం సినిమాలో ఈ అవకాశాన్ని దక్కించుకుని అందులో నటించారు. ఇక ఈ సినిమా 1949 వ సంవత్సరంలో విడుదలైంది.


అలా మొదలు పెట్టిన తన సినీ కెరీర్ ని ఎంట్రీ ఇచ్చిన 20 సంవత్సరాల లోపే 200కు పైగా సినిమాలలో నటించాడు. విజయ బ్యానర్ పై పాతాళభైరవి సినిమా నిర్మించిన అప్పట్నుంచి  ఎన్నో సినిమాలు నటించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కొన్ని సినిమాలలో తాత పాత్రలో, అన్న పాత్రలో ఇతరుల హీరో లతో సహా నటించారు. అయితే.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో సేవలు చేసి మెప్పు పొందారు.. అలా తమ స్థానాన్ని అప్పటికీ ఇప్పటికీ చెరగిపోకుండా ఉంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: