వెళ్లిపోయే ముందు ధ‌నుష్ కు ఐష్ ఏమ‌ని  చెప్పాడు..విడిపోయే ముందు అని రాయాలి.కానీ బంధం నుంచి వెళ్లిపోతున్నాడు క‌నుక వెళ్లిపోయే ముందు అని రాశాను? ర‌జ‌నీ లాంటి సూప‌ర్ స్టార్ డ‌మ్ ఆ ఇద్ద‌రినీ క‌లిపి ఉంచ‌లేదు..ఆ మాట‌కు వ‌స్తే ఏ శ‌క్తీ ఏ ఇద్ద‌రినీ ఇష్టంకు వ్య‌తిరేకంగా క‌లిపి ఉంచ‌దు..అప్పుడు స్వేచ్ఛ అనే ప‌దానికి అర్థం తూగదు..మ‌మ్మ‌ల్ని గౌర‌వించండి అని చెప్ప‌డంలో మా నిర్ణ‌యాల‌ను గౌర‌వించండం అంగీక‌రించండి అని సూచిండంలో  ఏదో తెలియ‌ని ఆజ్ఞ దాగి ఉంది.ఆ ఆజ్ఞ శివాజ్ఞ అని అనుకుని ఆ జంట చెప్పిన నిర్ణ‌యాలు ముందున్న కాలంలో బిడ్డ‌ల‌పై చెడు ప్ర‌భావం చూపించ‌కుండా ఉంటే మేలు.. అదే ఆశిద్దాం మ‌నం.ఆశించాలి కూడా! ప్రార్థించాలి కూడా!


పిల్లల‌కు రెక్క‌లివ్వండి వాళ్లు ఎగురుతారు..ఆకాశ వీధుల‌ను చుట్టి వ‌స్తారు అని చెప్ప‌డంలో అర్థం ఉంది. ఇది బాగా ప్ర‌సిద్ధి చెందిన క‌వి భావ‌న.. మీరు మీ పిల్ల‌ల‌కు రెక్క‌లు ఇవ్వండి.. మీరు ముళ్లు కాకుండా ఉండండి. మీరు పూల మార్గాల అన్వేష‌ణ‌కు వారికో అవ‌కాశం ఇవ్వండి.ఖ‌లీల్ జిబ్రాన్ లాంటి గొప్ప త‌త్వ‌వేత్త‌లు ప‌లికే మాట‌లకు అర్థం ఇది.సమానార్థ వాక్యం ఇది. మ‌రి! పిల్లలు ఏమౌతున్నారు.ధనుష్ - ఐష్ పిల్లలు ఏమైపోతున్నారు. గ‌తంలో విడిపోయిన జంట‌ల పిల్ల‌లు ఏమైపోయారు? ఇవ‌న్నీ ఇవాళ ప్ర‌శ్న‌లు.. స‌మాధానాలు మాత్రం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన పెద్ద‌లే కాదు మిగిలిన స‌మాజానికి చెందిన  అంతా కూడా కూడ‌గ‌ట్టుకుని ఇవ్వాల్సిందే!సింగిల్ పేరెంట్ ఇప్పుడు ఐశ్య‌ర్య. ఆమె ర‌జ‌నీకాంత్ కూతురు. మ‌రి! ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు  ఏమౌతున్నారు.ఆమె త‌న జీవితంలో తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యం.లేదా అత‌డే తీసుకోవాల్సి వ‌చ్చిన క‌ఠిన నిర్ణ‌యం అనుకోండి.ఇదే సంద‌ర్భంలో ఒంట‌రి ప‌క్షులుగా మిగిలే ఆ పిల్ల‌ల‌కు ఎగ‌ర‌డం ఎవరు నేర్పుతారు.ఓ చోట ఎద‌గ‌డం స్వేచ్ఛ ఎగ‌ర‌నివ్వ‌డం బాధ్య‌త.. అని చ‌దివేను.స్వేచ్ఛ అన్న‌ది ఇవాళ ఇద్ద‌రికీ స‌ర్వం స‌మానం అయితే బిడ్డ‌లకు మాత్రం త‌ల్లిదండ్రుల‌ను ఎంచుకునే స్వేచ్ఛ‌ను భ‌గ‌వంతుడు ఎందుకు ఇవ్వ‌డం లేదు. త‌ల్లిదండ్రులు ఇచ్చిన జ‌న్మ‌లో సార్థ‌క‌త ఎవ‌రికి వారు వెతుక్కోవాలి. అందుకు కార‌ణంగా పెంపకం ఓ గొప్ప ఉదాహ‌ర‌ణ అయి నిల‌వాలి.ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌ల గురించి ధ‌నుష్,ఐష్ ఏం మాట్లాడినా అవేవీ అంగీకార యోగ్యం కాదు.దారులు వేరు కానీ మీ పిల్ల‌లు మాత్రం వేరు కాదు మీ నుంచి వేరు ప‌డ్డ‌వారంతే! త‌ల్లి గ‌ర్భం నుంచివేరు ప‌డినంత మాత్రాన వారు వేరు క‌దా! వారెప్ప‌టికీ ఆ త‌ల్లి చాటు బిడ్డ‌లే!

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
 

మరింత సమాచారం తెలుసుకోండి: