ఇక సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించే అవకాశాలు ఉన్నాయి. తక్కువ థియేటర్లలో విడుదలైనా కాని బంగార్రాజు సినిమాకు మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. బంగార్రాజు సినిమా టికెట్లను ఏపీలోని పలు థియేటర్లలో పాత రేట్లకే అమ్ముతున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా కాని ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే నమోదు చేస్తోంది.ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా సంక్రాంతి సీజన్ లో విడుదల చేయడం బంగార్రాజు సినిమాకు కలిసొచ్చింది. నాగచైతన్య సైతం ఉత్సాహంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమా చూడని ప్రేక్షకులకు ఈ సినిమాపై ఆసక్తి బాగా ఎక్కువగా పెరిగే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం నెట్టింట నాగచైతన్య ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ ఫోటోలో నాగచైతన్య చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో నాగచైతన్య వేసుకున్న షర్ట్ ధర ఏకంగా 9,620 రూపాయలు అని సమాచారం తెలుస్తుంది.ఇక ఈ షర్ట్ g-star raw బ్రాండ్ కు సంబంధించిన షర్ట్ కాగా వైరల్ అవుతున్న ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అక్కినేని హీరో నాగచైతన్య వరుసగా విజయాలను అందుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. నాగచైతన్య తర్వాత సినిమా థాంక్యూ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

విడాకుల ప్రకటన తర్వాత కూడా సంతోషంగా ఉన్న యువ సామ్రాట్ నాగచైతన్య సమంత గురించి సైతం ఇంటర్వ్యూలలో చాలా పాజిటివ్ గానే మాట్లాడాడు.సమంత అభిమానుల హృదయాలను కూడా నాగచైతన్య గెలుచుకుంటూ ఉండటం గొప్ప విషయం. నాగచైతన్య ఒక హర్రర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. ఈ హర్రర్ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: