సంక్రాంతికి రిలీజైన అక్కినేని హీరోల బంగార్రాజు సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. రాజమండ్రిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ మీట్ ని మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కన్నబాబు, భరత్ లు గెస్టులుగా వచ్చిన ఈ ఈవెంట్ లో నాగ చైతన్య స్పీచ్ ప్రేక్షకుల మనసులు గెలిచేలా చేసింది.

ముందుగా అతిథులుగా వచ్చిన వారిని విష్ చేసిన నాగ చైతన్య.. రాజమండ్రి అని గట్టిగా అరిచి అందరు బాగున్నారా అంటూ ఇక్కడకి వచ్చిన ప్రతిసారి మీరు ఇచ్చే ప్రేమ, ఎనర్జీని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు నాగ చైతన్య. అంతేకాదు ఇక్కడకు వచ్చిన ప్రతి సినిమా ఈవెంట్ అయినా.. షూటింగ్ అయినా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని.. మీతో ఓ సెంటిమెంటల్ అటాచ్ అయిపోయింది థ్యాంక్ యు సోమచ్ ఫర్ యువర్ సపోర్ట్ అని అన్నారు నాగ చైతన్య.    

అలానే అక్కినేని అభిమానులందరికి లవ్ యు ఆల్.. ఇలాంటి టైం లో సినిమా రిలీజ్ చేయొచ్చా లేదా అన్న చిన్న భయంతో సినిమా రిలీజ్ చేశారు. మిమ్మల్ని నమ్మి.. కంటెంట్ ని నమ్మి రిలీజ్ చేస్తే మీరు ఇలా ఆదరిస్తారని తాను అసలు అనుకోలేదని అన్నారు చైతు. మా కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ చూపించారు.. కెరియర్ బెస్ట్ కలక్షన్స్ ఇవ్వబోతున్నారని అన్నారు. లైఫ్ లాంగ్ మీ అందరికి రుణపడి ఉంటానని చెప్పిన నాగ చైతన్య ఇలాంటి అభిమానులు తమకు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఒక యాక్టర్ గా ప్రతి సినిమాకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం కానీ దానికి ఒక ప్రత్యేకమైన టీం కావాలి ఈ సినిమాకు తనకు అలాంటి టీం దొరికిందని అన్నారు నాగ చైతన్య. 4 నెలల్లో సినిమా తీశారంటే తనే సినిమా చూసి షాక్ అయ్యానని అన్నారు. ఒకరిని ఒకరు నమ్మి ఈ సినిమా కోసం పనిచేశారు. ఇక మొదటగా ఈ సినిమా కోసం నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో నాన్న తనకు ఈ సినిమాతో చూపించారని అన్నారు నాగ చైతన్య. ఒక పండుగకి సినిమా హిట్టు కొడితే ఎలా ఉంటుందో నాన్న తనకు ఈ సినిమా ద్వారా చూపించారని అన్నారు. థ్యాంక్ యు సో మచ్ నాన్నా అన్నారు.            

ఇక సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తనని ఈ పాత్ర చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకు కళ్యాణ్ కి థ్యాంక్స్ అని అన్నారు నాగ చైతన్య. రారండోయ్ వేడుక చూద్దాం తో మీ అందరికి దగ్గరగా తీసుకొచ్చాడు.. ఈ సినిమాతో ఇంకా మీ దగ్గరకి తీసుకొచ్చాడని అన్నారు. ఇక టీం అందరికి కష్తపడి పనిచేసినందరికి థ్యాంక్స్ చెప్పారు నాగ చైతన్య. బేబమ్మ అలియాస్ సర్పంచ్ నాగలక్ష్మి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టింది. అలానే మిగతా టీం అంతా సినిమాకు బాగా హెల్ప్ చేశారని అన్నారు చైతన్య. పండుగ బ్లాక్ బస్టర్ అంటే ఏంటో తనకు అర్ధమైందని. మంచి సినిమాతో మీ ముందుకు వస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసని కానీ ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ తో వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందని అన్నారు నాగ చైతన్య. థ్యాంక్ యు అంటూ మైక్ ఇస్తూ సినిమాలోని వాసివాడి తస్సాదియ్యా అనే డైలాగ్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: