సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న బంగార్రాజు.. రాజమండ్రిలో బ్లాక్ బస్టర్ మీట్ కూడా చేసుకున్నారు. సినిమా ఫంక్షన్, అందులోనూ కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో రాజమండ్రి వంటి మంచి సెంటర్లో.. అనుమతి. అంతే కాదు, దానికి ఓ మంత్రి, మరో ఎంపీ కూడా చీఫ్ గెస్ట్.. అటు అభిమానులు, ఇటు వైసీపీ కార్యకర్తల సందడికి కొదవే లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ అయింది. కరోనా కాలంలో బంగార్రాజు ఫంక్షన్ కి ఎలా అనుమతి ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

పుష్పకి పార్టీ లేదా...?
పార్టీ లేదా పుష్పా..? ఆ సినిమాలో విలన్ పాపులర్ డైలాగుల్లో ఇది కూడా ఒకటి. కానీ ఆ సినిమాకి గతంలో పార్టీ లేకుండా చేశారు. ఏపీలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కొవిడ్ కారణంగా సినిమా ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. దీంతో చివరి నిమిషంలో అభిమానులు ఇబ్బంది పడ్డారు. చిత్ర యూనిట్ కూడా నిరుత్సాహానికి గురైంది. అప్పుడు కేసుల సంఖ్య తక్కువే, ఇప్పుడు ఏపీలో కొవిడ్ కేసుల సంఖ్య బాగా ఎక్కువ. మరి అప్పుడు పుష్ప సినిమా ఫంక్షన్ కి అడ్డొచ్చిన కొవిడ్, ఇప్పుడు బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ కి ఎందుకు రాలేదు. ప్రభుత్వం తలచుకంటే ఏదైనా సాధ్యమైనని నిరూపించారనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరో. పవన్ కల్యాణ్ తో ఏపీ ప్రభుత్వానికి అంత సఖ్యత లేదు. అందుకే ఆ సినిమా ఫంక్షన్ ని అడ్డుకున్నారని, ఇప్పుడు నాగార్జున కావడంతో ఈ సినిమా ఫంక్షన్ కి ఓకే చెప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులోనూ బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున.. థియేటర్లలో టికెట్ రేట్ల గురించి కామెంట్ చేయలేదు. రాజకీయాలు మాట్లాడనన్నారు. పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పని తాను చేయబోనని కుండబద్దలు కొట్టారు. అంటే నాగార్జున ఏపీ ప్రభుత్వానికి సపోర్ట్ అనే విషయం మరోసారి రుజువైంది. దీంతో సహజంగానే ఏపీ ప్రభుత్వానికి నాగార్జునపై సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ఈ ఫంక్షన్ కి అనుమతి వచ్చిందని అంటున్నారు. ఈ దశలో బంగార్రాజు ఈవెంట్ కి అనుమతి ఇచ్చి, గతంలో పుష్పకి అనుమతి ఇవ్వని విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: