పూరీ డైరెక్ట్ చేసిన సినిమాల్లో రొమాంటిక్ రచ్చ కన్ఫర్మ్.. కానీ పూరీ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కూడా రొమాంటిక్ ట్రీట్ ఉంటుంది. ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాదూరి డైరక్షన్ లో క్రేజీ మూవీగా వచ్చింది రొమాంటిక్. ఈ సినిమా కోసం ఢిల్లీ భామ కెతిక శర్మ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. తన హాట్ లుక్స్ తో ఆడియెన్స్ ని బుట్టలో వేసుకున్న కెతిక శర్మ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది.

నార్త్ సైడ్ భామ కదా గ్లామర్ షోలో పెద్దగా అడ్డు గోడలు ఏమి పెట్టుకోని అమ్మడు మొదటి సినిమా రొమాంటిక్ లోనే ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఆకాష్ పూరీ రొమాంటిక్ కథ, కథనాలు ఎలా ఉన్నా ఈ సినిమా టైటిల్ కు తగినట్టుగా రొమాన్స్ విషయంలో మాత్రం నిరాశపరచలేదు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా రొమాన్స్ ని అందరు ఎంజాయ్ చేస్తారు. కెతిక లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇక అది మరింత పీక్స్ లో ఉంటుంది. ఆకాష్ పూరీ ఈ సినిమాలో తన లిమిట్స్ క్రాస్ చేసి హీరోయిన్ కెతికతో రొమాన్స్ చేశాడు.

టైటిల్ లోనే రొమాంటిక్ అని పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చిన ఆడియెన్స్ ని నిరుత్సాహ పరిస్తే ఎలా అనుకున్నారో ఏమో రొమాంటిక్ లో రొమాన్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. హీరో ఎవరైనా సరే హీరోయిన్ మీద ప్రేమలో పడతాడు కానీ ఈ సినిమాలో అంతా రివర్స్ హీరోయిన్ కటౌట్ చూసి హీరో ఆమె మాయలో పడతాడు. ఆమె అందంతో పిచ్చెక్కిపోతాడు. రొమాంటిక్ గా దగ్గరవ్వాలని చేసినా ఈ ప్రయత్నంలో ఆమెకి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాడు. రొమాంటిక్ సినిమా ఆకాష్ పూరీ కెరియర్ లో ఓ మంచి ప్రయత్నమే అని చెప్పొచ్చు. అయితే సినిమా కామర్షియల్ గా మాత్రం పెదగా వర్క్ అవుట్ కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: