న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చాలా సింపుల్‌గా సినిమా తీసినా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటారు. ఇప్పటివరకు నాని నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈటీవల నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని ఇప్పటివరకు నటించని పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమా ద్వారా తనలోని వేరే కోణాన్ని పరిచయం చేశారు.


ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి హిట్ అందుకుంది. దీంతో నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆ స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు భారీగా వసూలు చేసింది. ఇందులో నానితోపాటు సాయిపల్లవి, కృతిశెట్టి నటించారు. వీరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా సక్సెస్‌తో నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ.. ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం నాని రెండు సినిమాలు సెట్స్‌ పై ఉన్నాయి. ఇందులో ‘అంటే సుందరానికీ..’ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు సమాచారం.


అలాగే నాని మరో సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా రాబోతోంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. కాగా.. దసరా సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని పాత్ర విభిన్నంగా ఉండబోతుంది. మరోసారి నాని నెగిటివ్ షేడ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించనున్నారు. ఇప్పటికే ‘శ్యామ్ సంగరాయ్’ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన నాని.. ఈ సినిమాలో కూడా సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. కాగా, ‘వీ, జెంటిల్‌మెన్’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించారు. అయితే ఈ సినిమాలో నాని పాత్ర ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: