నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల క్రేజీ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలయ్య ఇందులో రెండు పాత్రల్లో అదరగొట్టే పెర్ఫార్మన్స్ కనబరచగా ఆయన కి జోడీగా యువ భామ ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అఖండ గా అఘోరా పాత్రలో బాలయ్య పలికిన డైలాగ్స్, కనబరిచిన యాక్షన్, చేసిన ఫైట్స్ కి నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి సైతం విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ తో కెరీర్ పరంగా చాలా రోజుల తరువాత మంచి బ్రేక్ ని అందుకున్న బాలయ్య త్వరలో మరొకసారి బోయపాటితో వర్క్ చేయనున్నట్లు టాక్.

అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మంచి టాక్ తో బాగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న అఖండ మూవీ త్వరలో సక్సెస్ఫుల్ గా 50 రోజలు పూర్తి చేసుకోనుండడంతో త్వరలో ఓవర్సీస్ లోని కొన్ని ప్రత్యేక లొకేషన్స్ లో ఘనంగా 50 రోజుల వేడుకల్ని నిర్వచించేందుకు చిత్ర యూనిట్ తో కలిసి పలువురు నందమూరి ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరోవైపు వాటికోసం ఎంతో ఖర్చు పెట్టనున్నట్లు టాక్. బాలయ్య కెరీర్ పరంగానే కాక గత ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో మంచి విజయాన్ని అందుకున్న అఖండ రాబోయే రోజుల్లో మరింతగా దూసుకెళ్లాలని, తమ హీరో బాలయ్య కి సరైన సినిమా పడితే దాని ఫలితం అఖండ లానే అఖండమైన రీతిలో ఉంటుందని పలువురు నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: