టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం ఒక్కో సినిమాతో హీరోగా అమాంతం తన క్రేజ్ ని ఆకాశం అంత ఎత్తుకు పెంచుకుంటూ పోతున్న నటుడు ప్రభాస్. ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజక్ట్ కె ఇలా మొత్తంగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు మరొక మూడు సినిమాలు కూడా ప్రభాస్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమాలతో కనుక ప్రభాస్ హీరోగా మంచి విజయాలు అందుకున్నట్లైతే ఆయన ఇమేజ్, మార్కెట్ ని అందుకోవడం దాదాపుగా ఎవరికీ సాధ్యం కాదని అంటున్నారు విశ్లేషకులు. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం అతి త్వరలో ప్రభాస్ ఏకంగా ఒక హాలీవుడ్ బడా మూవీలో యాక్ట్ చేయనున్నారని సమాచారం. గతంలో హాలీవుడ్ లో ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా తెరకెక్కిన ర్యాంబో సిరీస్ లోని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ కొట్టాయి అనేది అందరికీ తెలిసిందే. వాటితో హీరోగా తాకంటూ ప్రేక్షకాభిమానుల్లో ప్రత్యేకంగా క్రేజ్ సొంతం చేసుకున్న సిల్వెస్టర్ ఇటీవల కొన్నాళ్లుగా దానికి కొనసాగింపుగా లేటెస్ట్ గా మరొక భాగం మూవీ తీయడం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారట.

వాస్తవానికి కొన్నేళ్ల క్రితం ప్రచారమైన వార్తల ప్రకారం ఈ లేటెస్ట్ సినిమాలోని ర్యాంబో పాత్రలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటించనున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే దానిపై హృతిక్ నుండి ఎటువటిని సమాధానం రాకపోవడంతో సిల్వెస్టర్ ఆయనని ప్రక్కనపెట్టారని టాక్. అయితే ప్రస్తుతం అతడి స్థానంలో లేటెస్ట్ మూవీలోని ర్యాంబో క్యారెక్టర్ కోసం ప్రభాస్ ని తీసుకోవాలని చూస్తున్నారట సిల్వేస్టేర్. తానే స్వయంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమాలో బాహుబలి నటుడు ప్రభాస్ అయితే పక్కాగా సరిపోతారని భావించిన సిల్వెస్టర్ త్వరలో ప్రభాస్ ని కలిసి ఈ సినిమా గురించి సంప్రదించనున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదుగాని ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం మన బాహుబలి త్వరలో హాలీవుడ్ ర్యాంబోగా అదరగొట్టడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: