నందమూరి బాలకృష్ణ పోయిన ఏడాది అఖండ చిత్రంతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు బాలకృష్ణ. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాప్ లు అందుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో నిరుత్సాగా పరుస్తున్న ఆయన అభిమానుల ఆకలినీ ఈ సినిమా తో తీర్చారని చెప్పవచ్చు. ఆయనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి ఇంతటి ఘన విజయం సాధించాడు బాలకృష్ణ. 

అలా అఖండ సినిమా తో హిట్ మాత్రమే కాదు ఆ దర్శకుడితో కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకునీ తమ జోడీ కి ఎదురు లే దు అని మరోసా రి నిరూపించుకున్నాడు బాలయ్య. ఇక ఈ సినిమా జనవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఓటిటీ లో రాబోతుంది. హాట్ స్టార్ లో ఈ చిత్రం విడుదల కాబో తు ఉండగా  టీవీలో వీక్షించాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అలా విడుదల అయిందో లేదో గోపీచంద్ మలినేని దర్శకత్వం లోని మాస్ చిత్రాన్ని మొదలుపెట్టాడు నందమూరి బాలకృష్ణ. 

క్రాక్ సినిమాతో పోయిన ఏడాది సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడితో సినిమా చేయాలనీ చాలా మంది హీరోలు ప్రయత్నించగా ఆయన బాలకృష్ణ తో సినిమా చేయాలని ఫిక్స్ అవ్వడం నందమూరి అభిమానులను బాగా ఆనందపరిచిందని చెప్పాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని దర్శకుడు ఇప్పటికే చెప్పేశాడు. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమా కథ ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ఉన్న అన్యాయాలను ఎదిరించే విధంగా బాలకృష్ణసినిమా స్క్రిప్ట్ ను తయారు చేయించారట. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఆయన రాష్ట్రంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: