ఆర్య సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని మంచి మంచి సినిమాలు తీస్తూ ఇప్పటివరకు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే మన హీరోలు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించాలని భావించారో అప్పటి నుంచి దర్శకులకు కూడా ఆ తరహా సినిమాలే చేయాలని హీరోలు సూచించారు.  

అయితే వారికి తగ్గట్లుగానే సుకుమార్ వెంటనే మారిపోయి ఆ సినిమాలే చేసే విధంగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. అలా పుష్ప అనే సినిమా రూపొందించాడు సుకుమార్. దేశం మొత్తం ఫిదా అయ్యేలా పుష్ప సినిమా చేశాడు అని చెప్పాలి. దేశ వ్యాప్త ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాలు చేసి దానిలో సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. పుష్ప సినిమా విడుదల అయ్యి నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా ఆ మేనియా లోంచి దిగడం లేదు అంటే సుకుమార్ తన ప్రతిభను ఎంతలా చాటుకున్నాడు అర్థం చేసుకోవచ్చు.

అయితే సుకుమార్ తీసిన ఈ సినిమా వల్ల భారీ స్థాయిలో ఆయనకు హీరోకి క్రేజ్ రావడమే కాకుండా ఆయన చేసిన గత చిత్రాలకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ వస్తుంది.  ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం లో చిత్రానికి హిందీ డబ్బింగ్ రెడీ అవుతుంది తొందర లోనే దాన్ని విడుదల చేసే విధంగా అక్కడి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇదే కనుక జరిగితే దేశంలోనీ టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో సుకుమార్ చేరిపోవడం ఖాయం అని చెప్పాలి. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయమైన సుకుమార్ టాలెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయం అవుతుండడం తెలుగువారికి ఎంతో గర్వకారణమని చెప్పాలి. ఇక పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను ఆయన ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి. 
      





మరింత సమాచారం తెలుసుకోండి: