టాలీవుడ్ యువ నటుల్లో ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన పేరు, క్రేజ్ సంపాదించుకున్న నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తొలిసారిగా శ్రీకాంత్ అడ్డాల తీసిన ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగారు. ఇక తొలిసారిగా శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమాతో పెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టిన వరుణ్ తేజ్, ఆ తరువాత తొలిప్రేమ, ఎఫ్2, గడ్డలకొండ గణేష్ ఇలా వరుసగా పలు సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు.

అందులో ఒకటి కిరణ్ కొర్రపాటి తీస్తున్న బాక్సింగ్ నేపధ్య చిత్రం గని కాగా మరొకటి ఎఫ్ 2 సీక్వెల్ గా వెంకటేష్ తో కలిసి చేస్తోన్న ఎఫ్ 3 మూవీ. అనిల్ రావిపూడి తీస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా నుండి నేడు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఒక వీడియో ద్వారా ఆయనకి విషెస్ అందించింది టీమ్. ఈ వీడియోలో వరుణ్ తేజ్ లేటెస్ట్ స్టైల్ ట్రెండీ సూట్ లో తన లుక్ తో అదరగొట్టారు. అయితే విశేషం ఏమిటంటే వాస్తవానికి ఏప్రిల్ 29న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ఒక్కరోజు ముందుగానే అనగా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ అధికారికంగా వీడియోలో ప్రకటించారు. అయితే ఈ డేట్ కి ఎంతో ప్రత్యేకత ఉంది.

గతంలో అనేక బడా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయి సెన్సేషన్ సృష్టించడంతో అదే రోజున తమ మూవీని కూడా రిలీజ్ చేస్తునన్నట్లు యూనిట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి తీస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక నేడు వరుణ్ తేజ్ బర్త్ డే వేడుకల్ని కుటుంబసభ్యుల మధ్య ఎంతో ఆనందంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: