క్రాక్ హిట్టు పడటంతో కెరియర్ లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న మాస్ మహరాజ్ రవితేజ మళ్లీ ఎప్పటిలానే రాన్ డైరక్షన్ లో వెళ్తున్నాడా అని కొందరు చర్చించుకుంటున్నారు. రవితేజ నెక్స్ట్ సినిమా ఖిలాడి ఇంకా పూర్తి కాలేదు కానీ దాని తర్వాత అరడజను సినిమాలను లైన్ లో పెట్టాడు మాస్ రాజా. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు ఇలా వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్న రవితేజ సినిమాల అవుట్ పుట్ మీద గురి తప్పుతున్నాడని మళ్లీ టాక్ వస్తుంది.

అంతేకాదు ఖిలాడి సినిమా అసలైతే లాస్ట్ ఇయర్ మేలోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు సినిమా పూర్తి కాలేదు. దీనిపై డైరక్టర్ రమేష్ వర్మతో రవితేజకి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగిందని టాక్. రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న రమేష్ వర్మ రవితేజతో ఖిలాడి సినిమా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశడు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీతో మరోసారి క్రాక్ లాంటి ఎనర్జిటిక్ హిట్ కొట్టాలని ఊపు మీద ఉన్నాడు. కానీ సినిమాను ఎంతకీ పూర్తి చేయట్లేదట రమేష్ వర్మ. అందుకే రవితేజ అతనికి వార్నింగ్ ఇచ్చాడట. ఓ టార్గెట్ పెట్టి ఆ టైం కల్లా షూటింగ్ పూర్తి చేయమని చెప్పారట.

ఇదిలాఉంటే ఖిలాడి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. సినిమా నుండి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో సినిమా నుండి మరో సాంగ్ రాబోతుందని ప్రకటించారు. క్రాక్ తో రవితేజ కెరియర్ బెస్ట్ హిట్ కొట్టగా రాబోతున్న సినిమాలతో మళ్లీ రవితేజ అదే హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. అయితే ఖిలాడి విషయంలో జరుగుతున్న ఈ విషయాలు చూస్తుంటే మాస్ రాజా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రవితేజ ఖిలాడి సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసి ఆడియెన్స్ ని సందడి చేయాలని చూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: