
చలన చిత్ర పరిశ్రమలో ఏంతో మంది హీరో , హీరోయిన్లు సినిమా సెట్స్ లో ప్రేమలో పడి అందులోనే మునిగి తేలుతూ ఉంటారు కొంత మంది వివాహాం చేసుకుంటారు, మరి కొంతమంది వివాహాం తర్వాత కొంత కాలానికే విడాకులు తీసుకుంటారు, మరికొందరు పెళ్లి పీటలేక్కబోతున్న సమయంలో బ్రేకప్ చెప్పుకొని ఒకరి మొఖం ఒకరు చూసుకోవడానికి సైతం ఇష్టపడరు.ఒకవేళ వివాహం చేసుకొని ఇప్పటివరకు కలిసి ఉంటున్న దంపతుల్లో సౌత్ ఇండియాలోనే ఎక్కువ అలాంటి వారి లో రాంకీ, నిరోషా దంపతులు కూడా ఉన్నారు.

90 వ దశకంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ కలిగి న నటుల్లో రాంకీ ఒకరు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండానే పరిశ్రమ లోకి వచ్చిన రాంకీ స్వశక్తి తో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సింధూర పువ్వు చిత్రంతో తెలుగు వారికి అత్యంత సూపరచితులు. ఆయన భార్య నిరోషా సైతం 90 దశకంలో కోలీవుడ్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో అగ్ర కథానాయికగా రాణించారు.
వీరిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం సింధూర పువ్వు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై ప్రేమలో పడ్డారు. ఆరోజుల్లో వీరిద్దరి ప్రేమ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా ఉండేది. ఈ చిత్రం విడుదలై ఘన విజయం సొంతం చేసుకోవడంతో ఈ జోడి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా నిరోషా కైతే తమిళ చిత్రాలతో పాటుగా తెలుగు, మలయాళ భాషల్లో సైతం అవకాశాలు వచ్చాయి.
కెరీర్ పరంగా మంచి పిక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే వీరిద్దరూ చేసిన పని అటు సినీ వర్గాల్లో, వారి కుటుంబాలను సైతం షాక్ కు గురి చేసింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే నిరోషా , రాంకీ తో కలిసి పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు . ఇలా కలిసి ఉన్న సమయంలో నే ఇరువైపులా కుటుంబాలు ఎన్నో ఒత్తిళ్లకు గురి చేసిన వేటిని పట్టించుకోకుండా చాలా సంవత్సరాలు జీవించారు.
వీరిద్దరి సహజీవనం గురించి మీడియా లో చాలా కాలం పలు కథనాలు వస్తూనే ఉన్న వాటిని పట్టించుకోలేదు. ఈ సమయంలో రాంకీ కన్నా ముఖ్యంగా నిరోషా గురించే అందరి ఆసక్తి ఎందుకంటే ఆమె అప్పటికే టాప్ హీరోయిన్ కావడంతో తమ పాటుగా లండన్ లో ఉన్నత చదువులు చదువుకున్నారు.అలాంటి నిరోషా ఆ ఇంట్లో పనిమనుషులు లేకుండా తానే స్వయంగా అన్ని పనులు చేసి షూటింగ్స్ కు వెళ్ళేది. మధ్యలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు అని గాసిప్స్ వినపడిన అవి అపోహలు అని తేల్చారు.
1995 లో వీరిద్దరూ వివాహాం తో ఒక్కటై అందరిని ఆశ్చర్య పరిచారు. ఎందుకంటే వీరి వివాహం కూడా చాలా రహస్యంగా జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసే ఉన్నారు. వీరికి ఒక అమ్మాయి.
![]() |
మరింత సమాచారం తెలుసుకోండి:
- కల్పిత పేదరికం ...!
- ఖంగ్‌చెండ్‌జోంగా జలపాతాలు...!
- అతని నటనను చూడటం గర్వంగా ఉంది : ఉన్ని ముకుందన్
- గిండి నేషనల్ పార్క్
- రామ్ కోసం మరోసారి మోహన్‌లాల్-జీతూ జోసెఫ్
- సాంకేతిక అభివృద్ధిని కొనసాగించడం
- గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్
- 'ది కంప్లీట్ యాక్టర్' గురించి అంతగా తెలియని వాస్తవాలు
- ఆదాయపు పన్ను చట్టం, 1961
- 12వ వ్యక్తి మూవీ రివ్యూ ...!
- స్వీయ ఆసక్తి ప్రజలను నడిపిస్తుంది ..!
- డాన్ ఐదో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ..!
- భారతదేశానికి బీమా ...!
- ఈ దీపావళికి విడుదల కానున్న AK61...!
- భారతదేశం యొక్క రాబోయే విద్యుత్ సంక్షోభం
- నెట్టయింట వైరల్ అవుతున్న అజిత్ వీడియో
- మళ్లీ మండుతున్నాయి ...!
- కమల్ తో సూర్య .. ఏ చిత్రానికో తెలుసా ?
- భూమిని విడిపించండి , రైతును కాపాడండి ..!
- రాజకీయాల్లో కింగ్ మేకర్ రాయవరం మునుసుబు