తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సవ్యసాచి మూవీ ద్వారా పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.. కానీ తన మొదటి సినిమాతోనే డిజాస్టర్ ని చవిచూసింది. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో తొలిసారిగా హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరోగా.. తొలి పరిచయం చేసిన సినిమా హీరో.. ఈ సినిమాలో ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఈ నెల 15న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకులు,అటు సెలబ్రిటీలు సైతం బాగా ఫిదా అయిపోయారు..
దీంతో ఈ ముద్దుగుమ్మ పై బాగా ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ఒక కొత్త హీరో అనే భావన లేకుండా తనతో బాగా నటించి, తన గ్లామర్ షో తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఈ సినిమాతో మరొక సారి తన ఖాతాలోకి హీట్ మూవీని వేసుకుంది. 
ఇక దీంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఈమెపై ప్రశంసలతో ముంచెత్తారు.. ఈమెను చూసి జగపతిబాబు తను మళ్ళీ హీరోగా నటించి నీది అగర్వాల్ తో రొమాన్స్ చేయాలని తన మనసులో మాటని బయటపెట్టాడు. ఇక మరొక నటుడు నరేష్ కూడా ఈమె పై మాట్లాడుతూ.. ఈమెకు ఉన్న క్రేజ్ చూసి వచ్చే జన్మలో ఆమెలా పుట్టాలని ఉందని తెలియజేశాడు.ఇక బ్రహ్మాజీ మాట్లాడుతూ నిధి అంటే సంపద ఆని.. ఆమె నటించే ప్రతి సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు సంపద నివ్వాలని తెలియజేశాడు.. ఈ సినిమాలో ఈమె సుబ్బు అనే పాత్రలో నటించింది. ఇక ఈ పాత్రని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈమె గ్లామర్ కి ఫిదా అయినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ తో కలిసి హరహర వీరమల్లులో జోడిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: